కార్తీకదీపం ఎపిసోడ్ 1171: రంగంలోకి దిగిన సౌందర్య..జైల్లో మోనితకు అదిరిపోయే ట్విస్ట్

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో హిమ దీపతో డాడీ మీద నాకు చాలా కోపంగా ఉంది, డాడీ మనల్ని అందరిని మోసం చేశాడు అంటూ ఏడుస్తుంది. బయటున్న కార్తీక్ ఆ మాటలు వినలేక చెవులు మూసుకుని వెళ్లిపోతాడు. కిందకు వచ్చి నో ఎవర్ని మోసం చేయలేదు, నేను ఏ తప్పు చేయలేదు అంటూ గట్టిగా అరుస్తాడు. మెట్లపైనే కుప్పకూలిపోతాడు. అందరూ వస్తారు. హిమ పైనుండే చూస్తుంది. దీప ఓసేయ్ ఎందుకే నొటికి వచ్చినట్లు వాగుతున్నావ్, ఆయన్ని మనశాంతిగా ఉంచరా మీరు అంటూ హిమ మీద అరుస్తుంది. కార్తీక్ ఏడ్చుకుంటూ దీప నువ్వే చెప్పు..నేను నిన్ను మోసం చేశానా అని అడుగుతాడు. అందరూ ఏంటిది అంటారు. సౌందర్య లేరా అంటుంది. సౌందర్య పక్కనే ఉన్న శౌర్యతో ఏంటే మీరు మీ ఇద్దరు కలిసి నా కొడుకుని హింసిస్తున్నారు కదే, మాటలతో, ప్రశ్నలతో, అలకతో ఇలా ఎన్నిరకాలుగా హింసిస్తున్నారు కదే అని కార్తీక్ ను ఓదారుస్తుంది.దీప, సౌందర్య కలిసి పైకి లేపుతారు. కార్తీక్ లేచి బయటకు వెళ్తాడు. వెనకే దీప వెళ్తుంది. సౌందర్య వీళ్లు పిల్లలు కాదు, వాడిపాలిట రాక్షసుల్లా తయారయ్యారు ఛీ అంటుంది సౌందర్య. ఇదంతా ఆ ప్రియమణి వింటూనే ఉంటుంది.
ఆరోజు రాత్రి భాగ్యం దేవుడికి పూజ చేస్తుంది. మురళీకృష్ణ వచ్చి దేవుడ్ని ఏం కోరుకున్నావ్ అని అడుగుతాడు. మన వియ్యపురాలి ఇళ్లు బాగుండాలి అని అంటుంది. ఇలా దీప దరిద్రం గురించి ఇద్దరూ మాట్లాడుకుంటారు. పుట్టినప్పుడు నుంచి సంతోషం లేదు అనుకుంటూ మరళీకృష్ణ ఏడుస్తాడు. భాగ్యం నాకెందుకో డాక్టర్ బాబుమీద కొంచెం అనుమానంగా ఉంది అని జైలునుంచి విడుదలక అయ్యాక ఆ మోనితను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాడేమో అని అంటుంది. మురళీకృష్ణ చెడామడాతిడతాడు.
ఇంకోపక్క జైల్లో మోనిత, సుకన్య కాసేపు సొల్లు కబుర్లు చెప్పుకుంటారు. ఇక మోనిత నన్ను జైల్లోకి పంపించి మీరంతా హ్యాపీగా ఉందాం అనుకుంటున్నారా..టెన్షన్ పడాలి, టన్నుల కొద్ది టెన్షన్ పడాలి..అది చూసి తట్టుకోలేక దీప నాతో కంప్రమైజ్ కి రావాలి..అలా జరగాలి అంటే డోస్ పెంచాలి, పెంచుతాను అనుకుంటూ రాక్షసంగా నవ్వుతుంది.
మరోసీన్ లో కార్తీక్ హిమ అన్న మాటలను తలుచుకుంటూ ఉంటాడు. దీప వచ్చి ఏదో మాట్లాడుతుంది. కార్తీక్ ఏం చెప్పొద్దు, అలా నా వంక జాలిగా చూడొద్దు అని నా మీద నాకె జాలెస్తుంది..ఏం చేయాలో, ఏం మాట్లాడాలో నాకే అర్థంకావటంలేదు అంటాడు. అందుకే ఇలాంటి టైంలో ఒంటరిగా ఉండొద్దు అంటారు అని దీప అంటుంది. ఇలాంటి రొటీన్ మాటలు చెప్పొద్దు అంటాడు. ఇలా మాటల్లో మాట దీప మీకు అన్నీ తెలుసు కానీ మీరు ఏం చేయరు అంటుంది. కార్తీక్ నన్నే బ్లేమ్ చేస్తున్నావా..అవునులే ఇంట్లో చిన్నపిల్లలే అలా మాట్లడుతున్నప్పుడు నువ్వు అంటంలో తప్పుేంఉందిలే అంటాడు. దీప మీకు రోగం ఏంటో తెలిసుకానీ..వైద్యం చేయరు..సమస్యఏంటో తెలిసినప్పుడు పరిష్కారం కూడా తెలుసుకోవాలి కదా..ఇప్పటిదాక మీరు ఆ మోనిత విషయంలో ఏం చేశారో చెప్పండి. కోర్టులో శిక్షపడినప్పుడు చిరునవ్వుతో ఇది ఇంటర్వెల్ మాత్రమే అన్నప్పుడు మీరేం మాట్లాడలేదు..అది అన్నట్లుగా హాస్పటల్ కి వచ్చింది..మీరేం చేశారు…మీరు ఏం తిరిగి సమాదానం ఇచ్చారు.ఇవ్వరు మాట్లాడరు. మీలో మీరే బాధపడతారు. అంటూ మోనిత గతంలో వేషాలు మార్చి వచ్చింది చెప్తూ..అన్నీ తెలుసు మీకు కానీ ఏమీ చేయలేకపోయారు.
దీప నువ్వు ఆవేశపడుతున్నావ్..నిజమే నాకు అన్నీ తెలిసినా నేనేమీ మాట్లాడలేదు..మౌనంగా ఉన్నాను..నా మౌనం చేతగాని తనం కాదు దీప..ఆ మౌనం మీకోసమే నీకు తెలియదు ఆ మోనిత ఎంత ప్రమదకరమైన మనిషో..ఆదిత్యకు యాక్సిడెంట్ యాదృచ్చికంగా జరగలేదు.ఆ మోనితే చేయించింది. నేను హాస్పటల్ లో ఉన్నప్పుడు చెపితే మన పిల్లలను చంపేస్తానని బెదిరించింది..ఇది చేతకానితనం కాదు దీప..ఆ పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే ఏం చేస్తారో నేను అదే చేశాను.. నువ్వు పిల్లలు నాకు కావాలి, ఆ మోనిత క్రిమినల్ బ్రెయిన్ నీకు తెలియదు దీప అంటాడు. తెలిసిమీరేం చేశారు అని దీప అంటుంది ఎపిసోడ్ ముగుస్తుంది.
తరువాయిభాగంలో కొంచెం మసాలా దట్టించారు. శౌర్య పాపం అని ప్రియమణిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు..రేపు కూడా పాపం అని ఆ మోనితను తెచ్చి పెట్టుకుంటారా అని అడుగుతుంది. ఇంకోసీన్ లో జైలుకి సౌందర్య వెళ్లి మోనితకు గట్టి వార్నింగ్ ఇస్తుంది. నువ్వు న్యూస్ పేపర్ ని మాత్రమే వాడావ్..నేను అన్నీ పేపర్లు..టీవీ ఛానల్లు అన్నీ వాడి నీ నిజస్వరూపం బయటపెట్టిస్తాను..నువ్వు ఏం చేయగలవ్ అంటుంది. దెబ్బకి ఈ మోనితకు ఫీజులు ఎగరిపోతాయ్.. మరన్ని వివరాలు రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version