కార్తీకదీపం సెప్టెంబర్ 13 ఎపిసోడ్ -1143 : సెంటిమెంట్ టచ్ తో దీపను మార్చేసిన మోనిత

telugu కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో కోర్టులో ఉన్న కార్తీక్ కు సౌందర్య వాళ్లు భోజనం పెడతారు. తిను అన్నయ్య ఏది మన చేతుల్లో లేదని అర్థమయిపోయింది.. కనీసం కడుపునిండా అయినా తిను అన్నయ్య అని ఆదిత్య అంటాడు. సౌందర్య వాళ్లు కూడా తిను అంటారు. కార్తీక్ దీప ఏం ఐపోయిందో అని అంటాడు. మోనితేకనక దీపకు కనపడితే ప్రాణాలకు తెగించి కోర్టుకు తీసుకొస్తుంది. నా కోడలు గురించి నాకు తెలుసు అంటూ సౌందర్య అంటుంది. మోనిత బతికే ఉందని చెప్పటానికి మన దగ్గర ఒక్క సాక్ష్యం ఉన్నా కోర్టులో ఈ వాదనలు ఉండేవి కాదని ఆదిత్య అంటాడు. ఆరోజు మన కళ్లముందే ఆ మోనిత డాక్టర్ వేషంలో వచ్చిందంటే ఇంకా నమ్మలేకపోతున్నాను..ఇంక క్రిమినల్ బ్రెయిన అనుకోలేదు. అలాంటి మోనిత మన దీపకు పట్టుబడుతుందని నాకు అనిపించటంలేదు. కార్తీక్ అన్నట్లు దీప నిజంగానే ఎంతపెద్ద ప్రమాదంలో పడిందో అని ఆనంద్ రావు బాధపడాతుడ. ఇంతలో పోలీస్ కోర్టుకి ఇంకా ఐదు నిమిషాలే టైం ఉంది డాక్టర్ సాబ్ త్వరగా తినేయండి అంటాడు.

లంచ్ బ్రేక్ అనంతరం కోర్టు సెషన్ ప్రారంభంమవుతుంది. జడ్డ్ మోనిత తరుపు లయర్ ను ప్రొసీడ్ అంటాడు. లాయర్ వాదోపవాదాలు మీ ముందు ఉంచటం జరిగింది. ముద్దాయి డా. కార్తీక్ ఈ హత్య చేసినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రాణాలు పోయాల్సిన డాక్టరే ప్రాణాలు తీయటం హేయమైన చర్యగా భావించి ముద్దాయిని నేరస్తుడిగా గుర్తించి కఠిన శిక్ష విధించాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పి కుర్చుంటాడు. జడ్డీ..ముద్దాయి తరుపున మీరైమైనా సాక్ష్యులు కానీ ఆధారులు కానీ ప్రవేశపెట్టాలనుకుంటున్నారా అని కార్తీక్ తరుపు లాయర్ ను అడుగుతాడు. ఏమి లేవ్ అంటాడు. వాదోపవాదాలు పూర్తయ్యాయి..తీర్పు చెప్పేముందు నువ్వు కోర్టుకు చెప్పుకోవాల్సింది ఉంది ఏదైనా ఉందా అని జడ్డీ కార్తీక్ ను అడుగుతాడు. కార్తీక్ ఉందని ముందుగా థ్యాంకూ మిలాట్ అని తన వ్యక్తిత్వం, కుటుంబం, గౌరవం గురించి సెంటిమెంట్ డైలాగ్స్ అన్నీ చెప్తాడు. తను గతంలో జరిగిందంతా చెప్పుకొస్తాడు. నేను నా భార్యను అనుమానించేలా మోనిత చాలా ప్రయాత్నాలు చేసింది. మోనిత నన్ను నా భార్యను విడదీయటానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఫలితంగా పదేళ్లు ఎడబాటు. ఇలా మోనిత చేసిన పనులన్నింటిని చెప్తాడు. జరిగిదంతా క్లిస్టల్ క్లియర్ గా జడ్డిముందు చెప్తాడు. మోనిత చనిపోయిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వాదించారు. కానీ మోనిత బతికే ఉందని అంటాడు.

ఇంకోపక్క దీప మోనితకు రివాల్వర్ గురిపెట్టి బెదిరిస్తుంది. మోనిత భయపడుతూ.. కార్తీక్ నన్ను చంపినా జీవతఖైదు పడేది. ఈ జైలుకెళ్లేది లేకుండా ఒక పరిష్కారం వెతుకుదాం అంటుంది. ఏంటే ఆ పరిష్కారం నా భర్తకు నిన్ను ఇచ్చి పెళ్లిచేయాలా, తెచ్చి నా ఇంట్లో పెట్టుకోవాలా..ఈ సమస్యకు నీ చావే పరిష్కారం చావు అంటుంది చెప్తునే ఉంటుంది దీప. మోనిత దీప..నేను చచ్చిపోతే ఒక్కదాన్నే పోను దీప, నా కడుపులో ఉన్న బిడ్డకూడా చచ్చిపోతుందని సెంటిమెంట్ చూపిస్తుంది. నువ్వు బిడ్డల్ని కన్నావ్, పదేళ్లు నీ బిడ్డలకు తండ్రెవరో చెప్పుకోలే నరకం అనుభవించావ్ అంటూ ఏడుస్తుంది. దీప మోదట కొంచెం సెంటిమెంట్ ఫీల్ అయినా.. ఆపవే నీ విషయంలో నా భర్త నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం లేదు నువ్వే కుత్రిమగర్భం తెచ్చుకున్నావ్ అంటుంది దీప.

అవును నిజమే ..కానీ నా తప్పుకు నా బిడ్డ అన్యాయం ఐపోవాలా , అలిసిపోయాను దీప ఈ ఆట నా ‌వళ్ల కాదు. కడుపుతో ఉన్నాను నేను ఇక ఎలాంటి ప్రయత్నాలు చేయను. నేను లొంగిపోయి కార్తీక్ ను విడిపిస్తాను అని మోనిత అంటుంది. దీప ఇప్పుడు వస్తావా, కోర్టుకు వచ్చి ఆయన్ను విడిపిస్తావా అని అడుగుతుంది. మోనిత వస్తాను అని చెప్పి, మీరంతా ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్లు అందుకే చంపలేకపోయారు. కానీ కార్తీక్ నన్ను పెళ్లి చేసుకుంటా అని రెండుసార్లు చెప్పలేదా. ఒకసారైతే..పీఠలమీదనుచ్చి లేచి వచ్చాడు. 16ఏళ్లు ప్రేమించినదాన్ని ఎంత ఆశపడిఉంటాను దీప. అంటూ తన ప్రేమ గురించి ఏడుస్తూ చెప్తుంది. మోనిత బాధలోను న్యాయం ఉంది పాపం. ఇలా మోనిత దీపను మాటల్లో పెడుతుంది. ఏదోఒక డైలాగ్స్ వేస్తూ.. ఫైనల్ గా వస్తాను లొంగిపోతాను అని మోనిత చెప్పడంతో..దీప రివాల్వర్ పక్కన పడేస్తుంది.

ఇటపక్క కోర్టులో మోనిత తరుపు లాయర్ శిక్షపడే సమయంలో ముద్దాయి కట్టుకథలు చెప్పి కోర్టు సమయంల వృద్దా చేయవద్దని చెప్పండి అంటాడు. కోర్టు సమయం విలువైనదే.. కానీ మనిషి జీవితం అంతకంటే విలువైంది అని జడ్డీ చెప్పి కార్తీక్ ను మాట్లాడమంటాడు. కార్తీక్ మోనిత వివిధ రూపాల్లో వచ్చినవాటిని చెప్తాడు. సోదమ్మ, టీ ఇచ్చే అమ్మాయి, డా.రీనా వేషం ఇలా మోనిత బెదిరింపులను చెప్తాడు. లాయర్ ఇంతేనా ఇంకైమైనా ఉందా అని అడుగుతాడు.

మోనిత తరుపు లాయర్ కార్తీక్ ను ప్రశ్నిస్తాడు. మోనితను చంపేలేదనటానికి మీరు మీ భార్య తప్ప వేరే సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతాడు. కార్తీక్ లేవ్ అంటాడు. ఇంతలో కార్తీక్ తరుపు లాయర్ రోషిణీ ప్రశ్నించటానికి పర్మిషన్ తీసుకుని రోషిణీని బోనులో ప్రవేశపెడతాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.