ఇకనుంచి మీ కార్డును స్వైప్ చేయాల్సిన అవసరం లేదు.. జస్ట్ ట్యాప్ చేస్తే చాలు..!

-

డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్.. ఆ కార్డు.. ఈ కార్డు అంటూ ఇప్పుడు ఏదైనా కొనాలన్నా.. ఏ లావాదేవీ చేయాలన్నా ఇవి ఉండాల్సిందే. అది ఆన్ లైన్ అయినా.. ఆఫ్ లైన్ అయినా.. కార్డ్ తోనే అన్నీ. రియల్ క్యాష్ వెంట పెట్టుకొని తిరిగే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు ఎవరి పర్సులో చూసినా ఓ ఐదారు క్రెడిట్, డెబిట్ కార్డులు ఉంటాయి. ఇప్పుడు వాటికి అంత ప్రాధాన్యత కూడా ఉంది. ఇక.. కార్డుల్లోనూ రకరకాలుగా ఉంటాయి. వీసా, మాస్టర్, మాస్ట్రో, ఇంటర్నేషనల్, గోల్డ్ పేర్లతో రకరకాల కార్డులు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి.

అయితే.. గత కొన్ని రోజులుగా వస్తున్న క్రెడిట్, డెబిట్ కార్డుల మీద వైఫైని పోలిన ఓ సింబర్ ఉంటున్నది. మరి.. దాని అర్థం ఏంటో తెలుసా? దాని వల్ల ఉపయోగం ఏంటో తెలుసా? లావాదేవీలను మరింత సులభతరం చేయడంలో ఆ సింబల్ ముఖ్యమైనది. బ్యాంకులు.. కస్టమర్ల లావాదేవీలను సులభతరం చేయడం కోసం కొత్త ఫీచర్ ను తీసుకొచ్చారు. అదే కాంటాక్ట్ లెస్ ఫీచర్. అంటే.. పీఓఎస్ కౌంటర్ వద్ద కార్డును స్వైపింగ్ మిషన్ లో స్వైప్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు పైన ఫోటోలో చూస్తున్నట్టుగా సింబల్ ఉన్న కార్డుదారులు ఆ కార్డును పీవోఎస్ మిషన్ వద్ద ట్యాప్ చేస్తే చాలు.. మీ ట్రాన్జాక్షన్ పూర్తయిపోతుంది. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్(ఎన్ఎఫ్సీ) అనే టెక్నాలజీతో ఈ కాంటాక్ట్ లెస్ ఫీచర్ పనిచేస్తుంది. ఈ కార్డులో ఆ ఎన్ఎఫ్సీ చిప్ ఉంటుంది. ఆ చిప్ లో కస్టమర్ కు సంబంధించిన ఖాతా వివరాలన్నీ ఉంటుంది. దీంతో ఆ మిషన్ వద్ద కార్డును ట్యాప్ చేయగానే చిప్ యాక్టివేట్ అయి కస్టమర్ ఖాతాకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తుంది. దాని ద్వారా లావాదేవీని పూర్తి చేసుకోవచ్చు.

అయితే.. ప్రస్తుతానికి వీసా కంపెనీ మాత్రమే ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పాయింట్ ఆఫ్ సేల్ వద్ద రెండు ఇంచుల దూరంలో కార్డును ఉంచాలి. దీంతో లావాదేవీ పూర్తవుతుంది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకే, ప్రాన్స్ లాంటి దేశాల్లో ఈ ఫీచర్ ఉన్న కార్డులను వినియోగదారులు ఇప్పటికే వినియోగిస్తున్నారు. ఇండియాలో ఇప్పుడిప్పుడే ఈ ట్రెండ్ మొదలైంది. వేగంగా లావాదేవీని పూర్తి చేయడమే ఈ కార్డులో ఉన్న బెస్ట్ క్వాలిటీ. కార్డు స్వైప్ చేయాల్సిన పని లేకుండా… పాస్ వర్డ్ ఎంటర్ చేయాల్సిన పనిలేకుండా.. ఎవరికీ కార్డును ఇవ్వకుండా లావాదేవీని అత్యంత సెక్యూర్డ్ గా పూర్తి చేసుకోవచ్చు.

ఇదంతా నాణేనికి ఓవైపు మాత్రమే.. మరోవైపు ఈ కార్డు వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. కాంటాక్ట్ లెస్ కార్డులను తీసుకొని పీఓఎస్ మిషిన్ల దగ్గరకు వెళ్లగానే ఆటోమెటిక్ గా లావాదేవీ ఇనిషియేషన్ అయ్యే ప్రమాదం ఉందని కొంతమంది వినియోగదారులు వాపోతున్నారు. ఒకవేళ కార్డు పోయినా కూడా వెంటనే బ్లాక్ చేయకపోతే మిస్ యూజ్ అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. ఈ కార్డు వల్ల కొన్ని ప్రతికూలతలు తప్పితే మిగితా వన్నీ వినియోగదారులకు ప్రయోజనాలే.

Read more RELATED
Recommended to you

Latest news