చేతిలో డబ్బులు లేవా..? ఈ యాప్స్‌తో క్షణాల్లోనే లోన్ పొందవచ్చు..!

-

అర్జంటుగా ఏదైనా బిల్లు కట్టాలా..? లేదంటే లోన్ చెల్లించాలా..? స్మార్ట్‌ఫోన్లు.. టెక్నాలజీ పుణ్యమా అని.. మనకు కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే లోన్లు ఇచ్చే అనేక యాప్‌లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.

అర్జంటుగా ఏదైనా బిల్లు కట్టాలా..? లేదంటే లోన్ చెల్లించాలా..? లేదా ఇంటి రిపేర్, మెడికల్ ఖర్చులు ఉన్నాయా..? ఎక్కడా డబ్బు అప్పు పుట్టడం లేదా..? అయితే దిగులు చెందకండి. ఎందుకంటే స్మార్ట్‌ఫోన్లు.. టెక్నాలజీ పుణ్యమా అని.. మనకు కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే లోన్లు ఇచ్చే అనేక యాప్‌లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. మరి వాటిపై ఓ లుక్కేద్దామా..!

1. మనీ వ్యూ (Mone View)

ఈ యాప్‌లో కనీసం రూ.10వేల నుంచి గరిష్టంగా రూ.5 లక్షల వరకు రుణం పొందవచ్చు. అలాగే తీసుకున్న లోన్‌ను 3 నెలల నుంచి 5 ఏళ్ల లోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇక లోన్ అప్లికేషన్ సబ్‌మిట్ చేస్తే 2 గంటల్లో లోన్ అప్రూవ్ అయి డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి.

2. మనీ ట్యాప్ (Money Tap)

ఈ యాప్ ద్వారా రూ.5 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. ఎలాంటి తనఖా పెట్టాల్సిన పనిలేదు. వినియోగదారులు రుణం తీసుకోవచ్చు లేదా ఆ రుణం మొత్తానికి సరిపోలిన అమౌంట్‌తో క్రెడిట్ కార్డు పొందవచ్చు. కేవలం 4 నిమిషాల్లోనే లోన్ ప్రాసెస్ అవుతుంది. అయితే 2 రోజుల్లో డబ్బులు అకౌంట్‌లో క్రెడిట్ అవుతాయి.

3. క్యూబెరా (Qbera)

ఈ యాప్‌లో గరిష్టంగా రూ.15 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. 24 గంటల్లో లోన్ అప్రూవ్ అయి డబ్బు ఖాతాలో జమ అవుతుంది. ఉద్యోగం చేసేవారు మాత్రమే కాకుండా స్వయం ఉపాధి చేసుకునే వారు కూడా ఈ యాప్ ద్వారా లోన్ తీసుకోవచ్చు.

4. రుపీ రెడీ (Rupee Redee)

ఈ యాప్‌లో రూ.5వేల నుంచి రూ.25వేల వరకు లోన్ ఇస్తారు. కేవలం 10 నిమిషాల్లోనే లోన్ తీసుకోవచ్చు.

5. లోన్ ట్యాప్ (Loan Tap)

ఇందులో స్వయం ఉపాధి పొందే వారు, ఉద్యోగులు లోన్ తీసుకోవచ్చు. చాలా త్వరగా లోన్ ప్రాసెస్ అయి డబ్బు అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version