ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ కూడా ఆధార్ కార్డ్ అనేది అత్యవసర డాక్యుమెంట్ గా మారింది. ప్రస్తుతం ఆధార్ లేనిది ఏ గవర్నమెంట్ పని కూడా జరగదు. కొన్ని కొన్ని సార్లు ఆధార్ కార్డ్ ఎక్కడైనా మిస్ అవుతూ ఉండొచ్చు. అందువల్ల చాలా మంది కంగారు పడతారు. అయితే ఎలాంటి కంగారు అవసరం లేదు.
మీరు Google Chromeలోకి వెళ్లి UIDAI అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. UIDAI వెబ్‌సైట్‌లో భాషా ఎంపికలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ నుండి మీకు ఈజీగా ఉండే భాషను ఎంచుకోండి. ఇక దీని తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. అక్కడ మీకు ఆధార్ సర్వీస్ ఎంపిక కనిపిస్తుంది. ఆధార్ సర్వీసెస్ ఆప్షన్ పై క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు ఆధార్ రిట్రీవ్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. అది ఓపెన్ చేసాక తరువాత పేజీలో మీ పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్ చిరునామాను పూరించండి. దీని తర్వాత క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి, సెండ్ ఓటీపీపై క్లిక్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ నంబర్ మీకు కనిపిస్తుంది. తరువాత మీరు ఆధార్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మీరు ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డ్‌లోని డీటెయిల్స్ కనుక అప్‌డేట్ చేయాలనుకుంటే ముందుగా UIDAI వెబ్‌సైట్ (https://uidai.gov.in)కి వెళ్లండి.అందులో My Aadhaar ఆప్షన్‌పై క్లిక్ చేయండి. తరువాత అప్‌డేట్ యువర్ సర్వీస్ ఆప్షన్‌కు వెళ్లండి.తర్వాత మీ ఆధార్ లింక్‌లో అప్‌డేట్ అడ్రస్‌పై క్లిక్ చేసి ఈ లింక్ ద్వారా ఆధార్ వివరాలు ఇంకా అడ్రెస్ ని అప్‌డేట్ చేయవచ్చు. తరువాత లాగిన్ ఆప్షన్‌పై క్లిక్ చేసి, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి లాగిన్ చేయండి. లాగిన్ చేయడానికి ఓటీపీని నమోదు చేయడానికి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఇక లాగిన్ అయిన తర్వాత మీ చిరునామాను అప్‌డేట్ చేయడానికి మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది.
ఇక్కడ కొత్త అడ్రస్ ని ఎంటర్ చేయండి. ఇంకా అలాగే అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి. తరువాత సబ్మిట్ ఆప్షన్‌పై క్లిక్ చేసి ఆ తరువాత ఫీజు చెల్లించండి. ఇక ఫీజు చెల్లించిన తర్వాత మీకు సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ (SRN) జనరేట్ అవుతుంది. ఎస్‌ఆర్‌ఎన్ ద్వారా మీరు ఆధార్ అప్‌డేట్ అభ్యర్థనను మీరు ట్రాక్ చేయవచ్చు.ఇలా మీరు ఆధార్ కార్డ్ లేకుండా కూడా మీ ఆధార్ నంబర్‌ను కనుగొనవచ్చు. ఇది కాకుండా మీరు మీ ఆధార్ కార్డ్‌లోని పాత పాత అడ్రెస్ ని తొలగించి కొత్త అడ్రస్ ని కూడా అప్‌డేట్ చేయవచ్చు.