కేంద్ర ప్రభుత్వం: ఈ సేవలకు ఆధార్ తప్పనిసరి…!

-

తాజాగా కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు ప్రవేశ పెట్టడానికి రెడీగా ఉంది. అవేమిటి అనే విషయానికి వస్తే… పలు రకాల సేవలు అందించగా వాహనదారులకు దీని వల్ల ఊరట కలగనుంది. అలానే పలు రకాల సేవలను ఆన్‌లైన్‌లోనే పొందేందుకు అవకాశం కూడా రానుంది. పైగా ఆధార్ కార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పూర్తి వివరాలని చూస్తే.. కేంద్ర రోడ్డు రవాణా శాఖ కొత్త ముసాయిదాను రూపొందిస్తోంది.

దీనికి సంబంధించి ఇందులో కీలక ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే ఆన్‌లైన్ డ్రైవింగ్ లైసెన్స్ సహా వంటి సేవలకు ఆధార్ కార్డు తప్పనిసరి చేస్తున్నారు. ఆధార్ కార్డు వెరిఫికేషన్ రూల్ చాలా వాటిని వర్తింపజేయనున్నారు. ఇది ఇలా ఉండగా ఆన్‌లైన్ డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, అడ్రస్ మార్పు, వెహికల్ రిజిస్ట్రేషన్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఇలా ఇటువంటి సేవల లో కూడా ఆధార్ తప్పనిసరి కాబోతోంది.

కేంద్ర ప్రభుత్వపు రోడ్డు రవాణా శాఖ వెబ్‌సైట్ నుంచి ఆన్‌లైన్ సర్వీసులు పొందాలని అనుకుంటే కనుక ఆధార్ తప్పనిసరి. అలానే ఆధార్ వెరిఫికేషన్ అమలు వలన ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు దొరికిపోతారు. ఒక బెనిఫిట్ ఉంది అదేమిటంటే వాహనదారులు ఆర్‌టీఓ ఆఫీస్‌కు వెళ్లకుండానే ఆన్‌లైన్‌లోనే పలు రకాల సేవలు పొందొచ్చు. ఆధార్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు కచ్చితంగా తీసుకోవాలి. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నెంబర్ ఇచ్చిన సరిపోతుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news