ఆధార్ కార్డు ని ఇలా సులభంగా తెలుగులో అప్డేట్ చేసుకోండి..!

-

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు ఒకటి. చాలా వాటికి ఆధార్ అవసరం అని అందరికీ తెలిసిందే. ఆధార్ కార్డ్ సేవలని అందిస్తున్న యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా మరిన్ని సేవలను ఆధార్ కార్డు హోల్డర్స్ కి ఇస్తోంది. ఇది ఇలా ఉంటే యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్, ఎంఆధార్ యాప్‌లో ఆధార్ కార్డుకు సంబంధించిన సేవల్ని పొందొచ్చు. అయితే మరో ఫీచర్‌ని అందిస్తోంది యూఐడీఏఐ తీసుకు రాగా.. ఇది ఆధార్ కార్డు హోల్డర్స్ కి బాగా ఉపయోగ పడుతుంది.

ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే… మాములుగా ఆధార్ కార్డ్ సేవలు ఇంగ్లీష్‌లోనే లభించేవి. కానీ ఇప్పుడు ప్రాంతీయ భాషల్లో కూడా ఆధార్ కార్డ్ సేవల్ని అందిస్తోంది యూఐడీఏఐ. కేవలం తెలుగే కాకూండా ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళ్, పంజాబీ, బెంగాలీ, గుజరాతీ, మళయాళం, మరాఠీ, ఒడియా లాంటి భాషల్లో ఆధార్ సేవల్ని ఇక పొందొచ్చు.

అయితే ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేయాలంటే మీ ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేయడం తప్పని సరి. ఇక తెలుగులో ఆధార్ కార్డ్ ఎలా అప్‌డేట్ చేయాలో చూసేద్దాం.

దీని కోసం ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ ఓపెన్ చేయండి.
నెక్స్ట్ హోమ్ పేజీలో Update Aadhaar సెక్షన్‌లో Update Demographic Data Online పైన క్లిక్ చేయాలి.
ఆధార్ సెల్ఫ్ సర్వీస్ అప్‌డేట్ పోర్టల్ ఓపెన్ అవుతుంది.
మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి… క్యాప్చా సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాలి.
Generate OTP పైన క్లిక్ చేసి.. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ కావాలి.
ఆ తర్వాత Update Demographics Data పైన క్లిక్ చేయాలి
అక్కడ భాషను సెలెక్ట్ చేయాలి.
ఆ తర్వాత మీరు కోరుకున్న భాషలో వివరాలు ఎంటర్ చేయాలి.
వివరాలన్నీ ఓసారి సరిచూసుకొని సబ్మిట్ చేయాలి.
మళ్లీ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి రూ.50 ఫీజు చెల్లించాలి. మీ ఆధార్ కార్డులో అప్‌డేట్స్ జరగడానికి ఒకటి నుంచి మూడు వారాల సమయం పడుతుంది. అంతే ఆ తరవాత కార్డు డౌన్లోడ్ చేసుకోచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version