పోస్టాఫీస్ కస్టమర్లకు అలర్ట్…!

-

పోస్టాఫీస్‌ లో మీకు ఖాతా ఉందా…? అయితే మీరు తప్పక ఈ విషయంని తెలుసుకోవాలి. కరోనా వైరస్ సెకండ్ వేవ్ చాల తీవ్రంగా మారింది. లాక్ డౌన్ నేపథ్యం లో పోస్టాఫీస్‌ల పని వేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.

కనుక పోస్టాఫీస్‌ కస్టమర్లు ఈ విషయాన్ని గమనించాలి. ఇక దీనికి సంబంధించి పూర్తిగా చూస్తే… లాక్ డౌన్ ఆంక్షలకు అనుగుణంగా పోస్టాఫీస్ పని వేళలను కుదించారు. కనుక ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే పని వేళల్లో చేసుకోవడం మంచిది. దీనితో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

పెద్ద పోస్ట్ ఆఫీసుల్లో కౌంటర్లు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కస్టమర్లకు అందుబాటు లో ఉంటాయి. ఇది ఇలా ఉంటే చిన్న పోస్టాఫీస్‌లు అయితే ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు పని చేయనున్నాయి.

నిన్నటి నుండి ఈ రూల్స్ మారాయి. ఈ మేరకు సీనియర్ సూపరింటెండెంట్, సికింద్రాబాద్ డివిజన్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ 19 నేపథ్యంలో కార్యాలయాలు తక్కువ మంది సిబ్బందితో పని చేస్తాయని, డెలివరీ సహా ఇతర సేవలు గతంలో మాదిరిగానే కొనసాగుతాయని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news