తెలంగాణలో లాక్ డౌన్ మూడోరోజు కఠినంగా అమలు చేస్తున్నారు పోలీసులు. కరోనా తీవ్రత నేపథ్యంలో పాతబస్తీ సహా పలు ప్రాంతాల్లో రంజాన్ పండుగ ఉన్నాసరే ప్రజలు ఎవరిని కూడా బయటకు రావద్దు అంటూ పోలీసులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. పాత బస్తి పరిసర ప్రాంతాలలో లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు.

చార్మినార్ ప్రాంతాల్లో నిర్మానుష్యంగా రోడ్లు మారాయి. షాపులన్ని క్లోజ్ చేసిన పోలీసులు.. బయటకు రావద్దని హెచ్చరించారు. రంజాన్ పండుగ సందర్భంగా కళ తప్పింది. మక్కా మజీద్ లో ప్రార్థనలు నిషేధించిన పోలీసులు.. ఎవ్వరు బయటకు రావొద్దని కోరుతున్నారు. నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు చేశారు.