ఆంధ్రా బ్యాంక్ కస్టమర్లందరూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లుగా సేవలు అందుకుంటారు. అయితే ఇప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. పూర్తి వివరాల లోకి వెళిపోతే… మీకు ఆ పాత అకౌంట్ నెంబర్ అలాగే ఉంటుంది. దానిలో మార్పు ఉండదు. కస్టమర్ ఐడీ కూడా అలానే ఉంటుంది. కానీ కొత్త పాస్ బుక్స్ వస్తాయి గమనించండి. అలానే ఇక నుండి ఆంధ్రా బ్యాంక్ యాప్ కూడా పని చేయదు గమనించండి.
మీకు కనుక ఆంధ్రా బ్యాంక్ చెక్స్ ఉంటే U-Mobile యాప్ ఉపయోగించాలి. అయితే అవి 2021 మార్చి 31 వరకే పని చేస్తాయి గుర్తుంచుకోండి. ఆ తర్వాత పనిచేయవు. ఆ తరువాత కొత్త చెక్ బుక్స్ వస్తాయి. ఇది ఇలా ఉంటే ఐఎఫ్ఎస్‌సీ కోడ్స్ కూడా మారిపోయాయి. ఈ విషయం అందరికీ తెలిసినదే. కొత్త ఐఎఫ్ఎస్‌సీ కోడ్స్ కోసం మీరు మీ బ్రాంచులో లేదా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-UBI వెబ్‌సైట్ లో తెలుసుకోవాలి.
ఏమైనా సందేహాలు ఉంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ కేర్‌కు కాల్ చేయాలి. టోల్ ఫ్రీ నెంబర్లు 1800 208 2244, 1800 22 22 44 కి డైల్ చేయవచ్చు. ఇలా మీరు సందేహాలు క్లియర్ చేసుకోవచ్చు. లేదా కస్టమర్ కేర్ నెంబర్ +91-80-61817110 కి డయల్ చేయచ్చు. భారత దేశం లో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది ఐదో స్థానం.