స్టీల్ ప్లాంట్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోడీకి సీఎం జగన్ మరోసారి లేఖ రాశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మీద పునరాలోచించాలని కోరారు. అలాగే ప్రధాని అపాయింట్మెంట్ కూడా సీఎం జగన్ కోరినట్టు చెబుతున్నారు. స్వయంగా కలిసి సమస్య వివరించేందుకు అవకాశం ఇవ్వాలని లేఖలో జగన్ కోరినట్లు తెలుస్తోంది. అఖిలపక్ష నేతలు కార్మిక సంఘాల నాయకులను ఢిల్లీకి తీసుకు వచ్చి మిమ్మల్ని కలిసే అవకాశం ఇవ్వాలని జగన్ కోరినట్టు చెబుతున్నారు.
ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి జగన్ నాలుగు ప్రత్యామ్నాయ మార్గాలను ఇప్పటికే జగన్ సూచించారు. ఇక మరోపక్క స్టీల్ ప్లాంట్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయవద్దంటూ నిన్న రాత్రి నుంచి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దాదాపు చాలా కిలోమీటర్ల మేర రహదారిలో ట్రాఫిక్ నిలిచిపోయినట్లు చెబుతున్నారు.