ఆపిల్ గూగుల్ ను దాటేసిందోచ్…!

-

చేతిలో ఓ ఆపిల్ ఫోన్ ఉంటే చాలురా బయ్.. ఈ జీవితానికి ఇది చాలు అని అనుకునే యువత కోకొల్లలు. ఎన్ని మొబైల్ బ్రాండ్స్ వచ్చినా.. ఎన్ని ట్యాబ్లెట్లు, ల్యాప్ టాప్ బ్రాండ్లు వచ్చినా ఆపిల్ ఆపిలే. ఆపిల్ ప్రాడక్ట్ చేతిలో ఉంటే ఆ కిక్కే వేరప్పా. అందుకే దానికి అంత డిమాండ్. అందుకే దిగ్గజ కంపెనీ గూగుల్ కూడా దాని ముందు చేతులెత్తేసింది. ఆపిల్ ను ఢీకొనలేకపోతున్నది. ప్రపంచంలోనే నెంబర్ వన్ కంపెనీగా ఉన్నప్పటికీ… బ్రాండ్ విషయంలో ఆపిల్ ను దాటలేకపోతున్నది గూగుల్.

ఈ ఏడాదికి ప్రపంచంలోనే అత్యంత ఉత్తమమైన బ్రాండ్ గా ఆపిల్ నిలిచింది. ఇంటర్ బ్రాండ్ అనే బ్రాండ్ కన్సల్టెన్సీ.. 2018 సంవత్సరం కోసం 100 ఉత్తమ గ్లోబల్ బ్రాండ్స్ జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో ఆపిల్ టాప్ లో ఉంది. రెండో స్థానంలో గూగుల్ ఉండగా.. మూడో స్థానంలో అమెజాన్, నాలుగో స్థానంలో మైక్రోసాఫ్ట్, ఐదో స్థానంలో కోకకోలా, ఆరో స్థానంలో సామ్ సంగ్, ఏడో స్థానంలో టయోటా, ఎనిమిదో స్థానంలో మెర్సిడస్ బెంజ్, తొమ్మిదో స్థానంలో ఫేస్ బుక్ , పదో స్థానంలో మెక్ డొనాల్డ్స్ నిలిచాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version