భారత్‏లో ‘నిద్రపోని నగరం’ ఒకటి ఉంది మీకు తెలుసా…?

మన భారత దేశం లో ఒక నిద్రపోని నగరం ఉంది. అయితే అక్కడ 24 గంటలు షాప్స్ ఒపెన్ ఉంటాయట. మరి దాని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా…? మరి పూర్తిగా చదివేయండి. కర్ణాటకలో వారం లో 24 గంటలు వ్యాపారాలు చేసుకునేందుకు అక్కడి ప్రభుత్వం వ్యాపార, వాణిజ్య సంస్థలకు అనుమతించి. ఆర్థికాభివృద్ధి తో పాటు, నిరుద్యోగ శాతాన్ని తగ్గించేందుకు పది మరియు అంత కంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్న వ్యాపార సంస్థలు, కంపెనీలు ఇక నుంచి రోజూలో 24 గంటలు పని చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది.

దీని కారణం గానే బెంగుళూరు పట్టణం భారత్‏ లో ఇదే ‘నిద్రపోని నగరం’మారనుందట. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రకాల సంస్థలు బెంగుళూరు కేంద్రంగా పని చేస్తున్నాయి. ప్రస్తుతం బెంగుళూరు టెక్నాలజీ హబ్‏గా పేరు గాంచింది. అయితే ఇప్పుడు ప్రభత్వం ఇలా చేయడం మూలాన ఇక బెంగుళూరుని నిద్రపోని నగరంగా అనొచ్చు. రోజులో 24 గంటలు వాణిజ్య సంస్థలు, దుకాణాలు పనిచేసేందుకు ప్రభుత్వం అనుమతించినా పలు విషయాలని కూడా చెప్పడం జరిగింది.

మహిళ ఉద్యోగులు ఎనిమిది గంటలకు మించి పనిచేస్తే వారికి ఓవర్ టైం అలవెన్స్ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఉద్యోగుల షిఫ్ట్ టైమింగ్స్‏ను ఉల్లంఘించే సంస్థలపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఓవర్ టైంతో పాటు, పనికాలం ఏ రోజూ కూడా పది గంటలు దాటకూడదని చెప్పింది. అలానే వారం సెలవు కూడా ఇవ్వాలని తెలిపింది. మహిళలకు రాత్రి 8 దాటిన తర్వాత పని చేయడానికి వీలు లేదని కూడా స్పష్టం చేసింది. కానీ వారి నుంచి రాతపూర్వక అనుమతి తీసుకొని రాత్రి 8 నుంచి ఉదయం 6 గంటల వరకు పనిచేయడానికి పర్మిషన్ ఇవ్వ వచ్చని తెలిపింది.