బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్: అక్టోబ‌ర్ నెల‌లో ఈ తేదీల‌లో బ్యాంక్‌లు బంద్‌

-

బ్యాంక్ క‌స్ట‌మ‌ర్ల‌కు బీ అల‌ర్ట్‌..! న‌గ‌దు వ్యవహారాలు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ అవ‌స‌రం. బిజినెస్ వ్యవహారాలు న‌డిపే వారికి బ్యాంకుల్లో చెక్కులు డిపాజిట్ చేయ‌డం, డీడీలు జ‌మ చేయ‌డం వంటివి ఉన్నందున దాదాపు ప్రతి ప‌ని దినమూ ముఖ్యమే. కొన్ని సందర్భాల్లో బ్యాంకు సెల‌వుల దృష్ట్యా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ నెల (అక్టోబ‌ర్‌)లో దాదాపుగా 11రోజులు సెల‌వులు వ‌స్తున్నాయి. ఇంత‌కు ఏ తేదీల్లో సెలవులు వ‌స్తున్నాయో ఓ లుక్కేయండి..

అక్టోబర్ 2 గాంధీ జయంతి కారణంగా బ్యాంకులు పనిచేయవు. అక్టోబర్ 6న ఆదివారం. అక్టోబర్ 7న రామ్ నవమి, అక్టోబర్ 8న దసరా సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంది. అక్టోబర్ 12న రెండో శనివారం. ఆరోజున బ్యాంకులు ఉండవు. ఇక అక్టోబర్ 13న ఆదివారం. ఈ రోజు ఎలాగూ బ్యాంకులు పనిచేయవు. అక్టోబర్ 20 ఆదివారం. బ్యాంకులకు సెలవు.

అక్టోబర్ 26న నాలుగో శనివారం. అక్టోబర్ 27న అదివారం. ఈ రోజే దీపావళి కూడా. అక్టోబర్ 28న గోవర్ధన్ పూజ ఉంటుంది. బ్యాంకులు పనిచేయవు. అక్టోబర్ 29న భాయ్‌దూజ్ సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులకు ఇవే సెలవులు వర్తిస్తాయి.కాబ‌ట్టి బ్యాంక్‌ల‌లో ఏమైనా ప‌ని ఉంటే వెంట‌నే వ‌ర్కింగ్ డేస్‌లో ప‌నిచేసుకోవ‌డం ఉత్త‌మం

Read more RELATED
Recommended to you

Exit mobile version