ఆన్‌లైన్ ఆర్డర్లలో బిర్యానీయే రారాజు..!

-

Biryani tops online food orders

జొమాటో, స్విగ్గీ, ఉబర్ ఈట్స్, ఫుడ్ పాండా.. ఇవన్నీ ఏంటి.. ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ యాప్స్. ఇంట్లో కూర్చొని క్షణాల్లో ఈ యాప్స్ ద్వారా నచ్చిన ఫుడ్‌ను ఆర్డర్ చేసుకోవచ్చు. వండుకునే టైమ్ లేనివాళ్లు, వండుకునే చేతగాని వాళ్లు, బ్యాచిలర్లు.. ఇలా చాలామంది ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకుంటున్నారు. ఇంటికే వేడి వేడి ఫుడ్డును తెప్పించుకొని నచ్చిన ఆహారాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ఆన్‌లైడ్ ఫుడ్ ఆర్డర్ యాప్‌ల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతోంది. అయితే.. ఆన్‌లైన్‌లో ఈ యాప్‌ల ద్వారా ఎక్కువ మంది ఏం ఆర్డర్ ఇస్తున్నారు? ఇది కాస్త ఇంట్రెస్టింగే కదా. ఇంకేముంటుంది. బిర్యానీకే అందరూ ఓటు వేశారట. ఎక్కువగా బిర్యానీనే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తున్నారట. ఫుడ్‌పాండా చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడయింది.

బిర్యానీ తర్వాత లిస్టులో ఉన్నవి అల్పాహారాలైన ఇడ్లీ, దోశ.. స్నాక్స్ మోమోస్, పాస్టా, షేక్స్, ఐస్‌క్రీం, రోల్స్ ఉన్నాయట. ఇండియాలోని అన్ని ప్రధాన నగరాల్లో బిర్యానీదే పైచేయట. ఎంతైనా బిర్యానీ కదా. అన్ని ఫుడ్‌లకు రారాజు అని దాన్ని అందుకే అంటారు కాబోలు.

Read more RELATED
Recommended to you

Latest news