ఇక నుండి మిస్డ్ కాల్ లేదా వాట్సాప్ ద్వారా సిలెండర్ ని బుక్ చేసుకోండి.. ఎలా అంటే..?

Join Our Community
follow manalokam on social media

గ్యాస్ సిలిండర్ ని కస్టమర్లు ఇప్పుడు మిస్సిడ్ కాల్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. ఇలా మాత్రమే కాకుండా వాట్సాప్ ద్వారా కూడా LPG ని బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫెసిలిటీ కేవలం ఇందనే గ్యాస్ ఆఫ్ ఇండియన్ గ్యాస్ వాళ్లకి మాత్రమే అవుతుంది. వీళ్లు కేవలం వాట్సాప్ ద్వారా కానీ మిస్డ్ కాల్ ఇచ్చి బుక్ చేసుకోవచ్చు.

ఈ ఫెసిలిటీ ని తీసుకొస్తున్నట్లు స్వయంగా ఇండియన్ ఆయిల్ వెల్లడించింది. దేశంలో ఎక్కడ వున్నా సరే మిస్డ్ కాల్ ఇచ్చి బుక్ చేసుకోవచ్చు. 8454955555 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. ఈ ఫెసిలిటీ వల్ల సమయం కూడా సేవ్ అవుతుందని కంపెనీ చెప్పింది. అలానే ఫోన్ చేసినందుకు ఎటువంటి రుసుము చెల్లించక్కర్లేదని వెల్లడించింది.

వాట్సాప్ ద్వారా ఎలా బుక్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే… కేవలం ఒక్క మెసేజ్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. 7588888824 కి మీరు కేవలం REFILL అని టైప్ చేస్తే చాలు.

గ్యాస్ సిలిండర్ స్టేటస్ ఎలా చూడొచ్చు..?

మీరు ఒకసారి బుక్ చేసిన తర్వాత స్టేటస్ చూసుకోవచ్చు. దీనికోసం మీరు రిజిస్టర్ నెంబర్ నుంచి ఇలా టైప్ చెయ్యాలి. ఒకవేళ మీ బుకింగ్ నెంబర్ 12345 అనుకోండి అప్పుడు STATUS # 12345 అని మెసేజ్ చేస్తే చాలు.

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...