బ్రాడ్ బ్యాండ్: ఏ నెట్‌వర్క్‌కు ఎంత ప్యాకేజీ అంటే…?

-

ఇప్పుడు ఇంటర్నెట్ వినియోగం బాగా ఎక్కువ అయిపోయింది. ఆన్ లైన్ క్లాసులు, వర్క్ ఫ్రామ్ హోమ్ వలన మరెంత ఎక్కువ మంది ఇంటర్నెట్ ని వాడుతున్నారు. అన్ని ఒకేలా లేవు. డేటా స్పీడ్‌, డేటా లిమిట్‌ను బట్టి ప్లాన్ల ధరలు కూడా మారుతున్నాయి. అయితే ఈరోజు మనం ఏ నెట్‌వర్క్‌కు ఎంత ప్యాకేజీ అనేది చూద్దాం.

ఇక పూర్తి వివరాల లోకి వెళితే… రిలయన్స్‌ జియో ఫైబర్‌ 1Gbps ప్లాన్‌ ధర నెలకు రూ. 3,999 గా ఉంది. అయితే ఇది అన్‌లిమిటెడ్‌ డేటాను అందిస్తోంది. నెట్‌ప్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌, డిస్నీప్లస్‌, హాట్‌ స్టార్‌, జియో సినిమా, జీ5 వంటి 15 ఓటీటీ యాక్సెస్‌ కూడా ఉంటుంది. ఈ 15 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ల విలువే రూ.1,650 వరకు ఉంటుంది.

అదే ఎయిర్‌టెల్‌ ఎక్స్-స్ట్రీమ్ VIP ప్లాన్‌ అయితే 1Gbps స్పీడ్‌తో డేటాను ఉపయోగించచ్చు. ఈ ప్లాన్‌ ధర నెలకు రూ.3,999. ఈ ప్లాన్‌ కింద ల్యాండ్ లైన్ ఫోన్ ‌తో అపరిమిత లోకల్, STD వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.

ఇది ఇలా ఉంటే ఎంటీఎన్‌ఎల్‌ (MTNL) బ్రాండ్‌బ్యాండ్ దిల్లీ, ముంబైలలో యూజర్లకు రెండు రకాల 1Gbps ప్లాన్లను ఆ సంస్థ అందిస్తోంది. FTH-2990 ప్లాన్ ధర నెలకు రూ.2,990. అయితే దీనిని స్టార్ట్ చేసిన సందర్భంగా నెలకు 6000GB డేటాను MTNL అందిస్తోంది. FTH-4990 పేరుతో మరో ప్లాన్‌ను కూడా సంస్థ అందిస్తోంది. నెలకు రూ. 4,990 విలువ ఉన్న ఈ ప్లాన్‌ ద్వారా 12000 GB డేటాను పొందవచ్చు.

అలానే యాక్ట్ బ్రాడ్ బ్యాండ్ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో 1Gbps ప్లాన్‌ను అందిస్తోంది. యాక్ట్ గిగా ప్లాన్ అయితే నెలకు 2,500GB డేటాను ఆ సంస్థ అందిస్తోంది. ఈ ప్యాకేజీ ధర నెలకు రూ.5,999 గా వుంది.

ఇది ఇలా ఉంటే స్పెక్ట్రా ఫాస్టెస్ట్ ప్లాన్’తో 1Gbps బ్రాడ్‌బ్యాండ్ డేటా ప్యాకేజీని అందిస్తోంది. ఫాస్టెస్ట్ ప్లాన్‌తో నెలకు 500GB డేటాను స్పెక్ట్రా అందిస్తోంది దీని ధర నెలకు రూ.1,549. దీంతో పాటు సెమీ యాన్యువల్, యాన్యువల్ ప్లాన్లతో అపరిమిత డేటా ప్యాకేజీని కూడా పొందొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news