BSNL Rs.98 Plan… రోజు 2 జీబీ ఉచితంగా…!

-

జియో వచ్చింది.. టెలికాం రంగాన్నే ఓ కుదుపు కుదిపేసింది. అప్పటి వరకు టాప్ లో ఉన్న ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియాలను కింద పడేసింది. ఒక్కసారిగా పైకి ఎగబాకింది. అందరు యూజర్లను తన వైపుకు తిప్పుకున్నది జియో. దాని దెబ్బకు గిలగిల కొట్టుకున్నాయి మిగితావి. దాంట్లో బీఎస్ఎన్ఎల్ కూడా ఒకటి.

అయితే.. బీఎస్ఎన్ఎల్ అప్పట్లా లేదు.. ఇప్పుడు మారిపోయింది. యూజర్లను ఆకర్షించడానికి.. తన యూజర్లను పెంచుకోవడానికి జియోకు గట్టి పోటీనిస్తోంది. దానిలో భాగంగా ఎన్నో అద్భుతమైన ఆఫర్లను యూజర్ల ముగింట ఉంచింది. తాజాగా ఇదివరకే అందుబాటులోకి తీసుకొచ్చిన 98 రూపాయల ప్రిపెయిడ్ ప్లాన్ లో మార్పులు చేసింది. ఆ ప్లాన్ లో ఎక్కువ డేటాను ఇవ్వనుంది. అంతే కాదు… తన యూజర్లకు ఈరోస్ నౌ సబ్ స్క్రిప్షన్ ను కూడా ఫ్రీగా ఇవ్వనుంది.

ప్రస్తుతానికి 98 ప్లాన్ కింద 1.5 జీబీ డేటాను అందిస్తోంది బీఎస్ఎన్ఎల్. ఆ ప్లాన్ వాలిడిటీ 26 రోజులు. ఆ డేటాను 2 జీబీకి పెంచింది. కాకపోతే ప్లాన్ వాలిడిటీని రెండు రోజులు తగ్గించింది. అంటే 24 రోజులకు కుదించింది. దాంతో పాటు ఉచితంగా ఈరోస్ నౌ యాప్ ను ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version