ఈపీఎఫ్‌ని ఇలా ఈజీగా ట్రాన్స్‌ఫర్‌ చేసుకోండి!

-

సాధరణంగా మన కంపెనీ పీఎఫ్‌లకు సంబంధించిన ఏ విషయమైన అంత సులభంగా జరగదు. కానీ, ఈ చిన్న టెక్నిక్‌తో చాలా సులభంగా మన పీఎఫ్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ మీ పీఎఫ్‌ ను ఆన్‌లైన్‌ ద్వారా బదిలీ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే ఈ ట్రాన్స్‌ఫర్‌
‌ అంతా రిటైర్మెంట్‌ ఫండ్‌ బాడీ సూచించిన ప్రకారమే జరుగుతుంది. అది సూచించిన విధంగానే ఆన్‌
లైన్‌లో ఈపీఎఫ్‌ను బదిలీ చేయదలచుకుంటే ఈ సులువైన మార్గాలను ఫాలో అవ్వండి అంతే! మీరే స్వయంగా మీ పీఎఫ్‌ అకౌంట్‌ను ట్రాన్స్‌ఫర్‌  చేయవచ్చు. ఈపీఎఫ్‌ఓ అనేది ప్రపంచంలో అతి పెద్ద సోషల్‌ సెక్యూరిటీ ఆర్గనైజేషన్‌గా గుర్తింపు పొందిన . 2016–17 వార్షిక రిపోర్టును గమనిస్తే ఈ సంస్థ సభ్యత్వానికి సంబంధించి 19.34 కోట్ల అకౌంట్లు ఉన్నాయి.

ఉమంగ్‌ యాప్‌ (UMAANG) ఉపయోగించి మీ ఈపీఎఫ్‌ అకౌంట్‌కు సంబంధించిన పనులను చేసుకోవచ్చు. అదేవిధంగా మీ పీఎఫ్‌ పాస్‌బుక్‌ను కూడా ఇందులో చూసుకోవచ్చు. మీ క్లెయిమ్‌ గురించి ఏవైన వినతులు ఉంటే పంపొచ్చు. అలాగే ముందుగా మీరు చేసుకున్న క్లెయిమ్‌కు సంబంధించిన స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. ఇంకా చాలా వ్యవహారాలు ఈ యాప్‌ని ఉపయోగించి చేయవచ్చు. ఎంప్లాయర్, ఎంప్లాయీ ఇద్దరూ కలసి ఎంప్లాయీ నెల జీతంలోని బేసిక్‌ శాలరీ, డియర్నెస్‌ అలవెన్సు మొత్తంలో 12 శాతాన్ని ప్రతి నెలా ఆ ఎంప్లాయీ ఈపీఎఫ్‌ అకౌంట్లో జమ చేస్తారు. అయితే ఈపీఎఫ్, పీఎఫ్‌లకు కంట్రిబ్యూట్‌ చేయాలంటే ఈపీఎఫ్‌ చట్టం కింద రిజిస్టర్డ్‌ కంపెనీ లేదంటే సంస్థల్లో పనిచేసే ఉద్యోగస్థులకు మాత్రమే అవకాశం ఉంటుంది.

  • యూనిఫైడ్‌ మెంబర్‌ పోర్టల్‌ను దర్శించండి https://unifiedportal&mem.epfindia.gov.in/memberinterface/
  • అక్కడ మీ యూఏఎన్‌ పాస్‌వార్డ్‌ తో లాగిన్‌ అవ్వండి.
  • ఇది ప్రతి వినియోగదారునికీ ప్రత్యేకంగా కేటాయించే యూనిక్‌ నంబర్‌.
  • తర్వాత, ఆన్‌ లైన్‌ సర్వీసెస్‌కు వెళ్లాలి. అక్కడ చీవన్‌ మెంబర్‌– వన్‌ ఈపీఎఫ్‌ అకౌంట్‌ (ట్రాన్స్‌ఫర్‌
    ‌ రిక్వెస్ట్‌) (One Member & One EPF Account (Transfer Request) అనే ఆఫ్షన్‌ పై∙క్లిక్‌ చేయాలి.
  • తర్వాత, వ్యక్తిగత సమాచారం (Personal Information)తో ప్రస్తుత ఉద్యోగానికి సంబంధించిన పీఎఫ్‌ అకౌంట్‌ను వెరిఫై చేసుకోండి.
  • Get Details పై క్లిక్‌ చేయండి. అప్పడు అంతకుముందు ఉద్యోగానికి సంబంధించిన పీఎప్‌ అకౌంట్‌ వివరాలు కనిపిస్తాయి.
  • అటెస్టింగ్‌ ఫారం కోసం గతంలో పనిచేసిన ప్రీవియస్‌ ఎంప్లాయర్‌ని గానీ, ప్రస్తుతం పని చేస్తున్న కరెంట్‌ ఎంప్లాయర్‌ని గానీ సెలెక్ట్‌ చేసుకోవాలి.
  • Get OTP పై క్లిక్‌ చేయాలి. దీనితో మీ యూఏఎన్‌రిజిస్టర్డ్‌ మొబైల్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
  • అప్పడు ఓటీపీని ఎంటర్‌ చేసి, Submit పైన క్లిక్‌ చేయాలి. అంతే ఈపీఎఫ్‌ ట్రాన్స్‌ఫర్‌ ‌ పని పూర్తయినట్లే.

Read more RELATED
Recommended to you

Exit mobile version