ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్ ల వినియోగం రోజురోజుకీ పెరిగిపోతోంది. పుట్టిన పిల్ల నుండి పండు ముసలి వరకు సెల్ ఫోన్ వాడుతున్నారు. అయితే పసి పిల్లలు మారాం చేయటం ద్వారా వారి చేతిలో సెల్ ఫోన్ లు పెట్టి పక్కన కూర్చో పెడుతున్నారు తల్లిదండ్రులు. అయితే సెల్ ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. సెల్ ఫోన్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల కొన్ని ప్రమాదాలను తగ్గించవచ్చు. మరి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇక్కడ తెలుసుకుందాం..
రోజువారి జీవితంలో సెల్ ఫోన్ వాడకం ప్రతి ఒక్కరికి తప్పనిసరి అయింది. అయితే బ్యాటరీ ఛార్జింగ్ తక్కువగా ఉన్నప్పుడు ఫోన్ అస్సలు మాట్లాడకూడదు. అలా మాట్లాడడం వల్ల మనమీద రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
ప్రతి చిన్న విషయానికి ఫోన్ చేయ వలసిన అవసరం ఏమాత్రమూ లేదు. అవతల వారికి ఏదైనా సమాచారం అందజేయాలి అనుకుంటే మెసేజ్ రూపంలో అలవాటు చేసుకోవడం ఎంతో మంచిది.
పూర్తిస్థాయిలో ఛార్జింగ్ ఉన్నప్పటికీ తొందరగా చార్జింగ్ అయిపోతు ఉంటే, బ్యాటరీ లో ఏదో సమస్యలు ఉన్నాయని అర్థం. అలాంటప్పుడు కొత్త వాటిని ఉపయోగించాలి.
కొందరు గంటల తరబడి ఫోన్ లో మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారు బ్లూటూత్ లేదా ఇయర్ ఫోన్స్ పెట్టు కోవడం ఎంతో మంచిది. ఇలా మాట్లాడటం వల్ల ఎన్నో దుష్ప్రభావాల నుంచి తప్పించుకోవచ్చు.
వేసవి కాలంలో ఎక్కువ సేపు చార్జింగ్ పెట్టడం వల్ల ఫోన్ వేడెక్కి కొన్నిసార్లు పేలే ప్రమాదం ఉంది. ఫోన్ లో ఏదైనా చిన్న సమస్య తలెత్తినా వేరే ఫోన్ వాడడం ఎంతో మంచిది.
అనవసరమైన ఫైళ్లను, ఫోటోలను ఎప్పటికప్పుడు తొలగించడం ద్వారా ఫోన్లు హ్యాంగ్ కాకుండా ఉంటాయి.
ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఫోన్ వాడడం వల్ల రేడియేషన్ ముప్పు కొంచమైన తగ్గుతుంది.