కండోమ్ టెస్టర్ జాబ్ అంటే ఏమిటో మీకు తెలుసా..?

కొన్ని రకాల కంపెనీలు మార్కెట్ లో కండోమ్స్ ని అమ్ముతారు అని మనకి తెలుసు. కానీ ఈ కండోమ్ టెస్టర్ అంటే ఏమిటి …?, నిజంగా ఈ జాబ్ ఉంటుందా…? ఇటువంటి సందేహాలు చాలా మందిలో ఉండే ఉంటాయి. వాటి కోసం ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొన్ని కంపెనీలు కండోమ్ ని మార్కెట్ లో అమ్ముతారు.

అయితే మార్కెట్ లోకి తమ ఉత్పత్తులను విడుదల చేసే ముందు వాటిని టెస్ట్ చేయడం జరుగుతుంది. టెస్ట్ చేయడానికి వాళ్ళు కండోమ్ టెస్టర్స్ తో పరీక్షిస్తాయి. దీని కోసం ప్రత్యేకంగా కొంత మందిని వాళ్ళు నియమిస్తారు.

ఆ టెస్టర్స్ ని నియమించి ఈ కండోమ్స్ ని వాడేటప్పుడు ఏమైనా ఇబ్బంది కలిగిందా, సౌకర్యవంతంగా ఉందా లేదా ఇలా కొన్ని విషయాల పై టెస్టింగ్ జరుగుతుంది. కంపెనీలు నియమించిన టెస్టర్స్ నుండి వాళ్ళకి కావలసిన ముఖ్యమైన ఫీడ్ బ్యాక్ ని తీసుకోవడం జరుగుతుంది.

ఒకవేళ ఏవైనా అసౌకర్యం కానీ ఇబ్బంది కానీ ఏదైనా ఇంప్రూమెంట్ కానీ ఉంది అంటే అప్పుడు వాళ్ళు మార్పులు చేయడం జరుగుతుంది. ఈ విధంగా కండోమ్ టెస్టర్ ని కంపెనీలలో నియమించడం జరుగుతుంది.

అయితే వాళ్లకి ఏమైనా జీతం ఇస్తారా..? లేదా ఫ్రీగా పని చేయించుకుంటారా అనేది చూస్తే… వీళ్ళకి కూడా వేతనాలు ఇస్తారు. ఇందు కోసం ఏడాదికి రూపాయలు 21 లక్షలు వరకు వాళ్లకి చెల్లించడం జరుగుతుంది.