హత్య కేసులో అడ్డంగా దొరికిన బాక్సర్ సుశీల్ కుమార్… సంచలనం రేపుతున్న ఫోటో…!

సాగర్ రానా హత్య కేసులో ఆరు రోజుల పాటు పోలీసు కస్టడీలో రెండుసార్లు ఒలింపిక్ పథకాలను సాధించిన బాక్సర్ సుశీల్ కుమార్‌కు ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా వైరల్ అవుతుంది. సుశీల్ కుమార్ గ్యాంగ్ స్టర్ కాలా జాతేడి సోదరుడు ప్రదీప్ తో కనిపించారు. ఈ ఫోటోను ఫేస్‌బుక్‌లో డిసెంబర్ 18, 2018 నాటిదిగా తెలుస్తుంది.

ఢిల్లీ పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, సుశీల్ పక్కన కూర్చున్న వ్యక్తి గ్యాంగ్ స్టర్ కాలా జతేడి సోదరుడు ప్రదీప్, అతని తలపై రూ .7 లక్షల రివార్డ్ కూడా ఉంది. ప్రస్తుతం అతను విదేశాలకు పారిపోయాడని తెలిపారు. కాలా జాతేడి సోదరుడు ప్రదీప్‌కు సహాయం చేయడానికి సుషీల్ కుమార్… సోనిపట్ వెళ్ళాడు. 12 రోజుల పాటు పరారీలో ఉన్న పోలీసులు సుశీల్ మరియు అతని సహచరుడు అజయ్ కుమార్ ను అరెస్ట్ చేశారు.