ఇక నుండి ఈపీఎఫ్ బ్యాలన్స్ చెక్ చేసుకోవాలంటే ఇది తప్పనిసరి..!

-

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇప్పుడు ఈ నామినేషన్ ని తప్పని సరి చేసింది. ఇప్పుడు ఈ-నామినేషన్ చేయకపోతే సబ్‌స్క్రయిబర్లు తమ పీఎఫ్ పాస్ బుక్‌లో ఎన్ని డబ్బులున్నాయో తెలుసుకోవడానికి కుదరదు. అదే విధంగా పాస్‌బుక్‌ను కూడా చూసుకోవడానికి అవ్వదు. కనుక ఈపీఎఫ్ఓ ఖాతాదారులు ఈ నామినేషన్ ని తప్పనిసరి అని గుర్తుంచుకోవాలి.

ఇప్పటి దాకా అయితే ఈ నామినేషన్ అనేది తప్పనిసరి కాదు. కానీ ఇప్పుడు తప్పనిసరి చేసింది. గతం లో అయితే పీఎఫ్ సబ్‌స్క్రయిబర్లు తేలికగా పీఎఫ్ బ్యాలెన్స్‌ను, పాస్‌బుక్ చెక్ చేసుకోవడానికి అయ్యేది. ఈ-నామినేషన్ చేయకపోయినా సరే ఎంప్లాయీస్ ప్రావిడెందట్ ఫండ్ ఆర్గనైజేషన్‌ వెబ్‌సైట్‌ లోకి వెళ్తే వారికి పాస్‌బుక్ వివరాలు వస్తాయి.

ఈజీగా దానిలో బ్యాలెన్స్‌ ని చెక్ చేసుకోచ్చు. కానీ ఇప్పుడు ఈజీ కాదు. ఇప్పుడు మీ పీఎఫ్ అకౌంట్‌కి నామినీని యాడ్ చేస్తేనే వివరాలని చూడడానికి అవుతుంది. ఒకరు లేదా అంత కంటే ఎక్కువ నామినీలు అయినా పరవాలేదు.

ఈపీఎఫ్ అకౌంట్‌లో ఈ-నామినేషన్‌ను దాఖలు చేసేందుకు, నామినీ పేరును ఇవ్వడం తప్పనిసరి. మీ యొక్క నామినీ అడ్రస్, పీఎఫ్ సభ్యులకు వీరు ఏమవుతారు వంటి వివరాలని నమోదు చేసుకోవాలి. అలానే పీఎఫ్ అకౌంట్‌లో ఎంత వాటాను వారికి ఇవ్వాలనుకుంటున్నారో కూడా చెప్పాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news