పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. ఇక నుండి వీరికి రెండు ఖాతాలు..!

పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్. ఇక నుండి కొత్త రూల్స్ వస్తున్నాయి. EPF అదనపు కంట్రిబ్యూషన్స్‌పై అర్జించిన వడ్డీ మొత్తంపై పన్ను విధింపు అంశానికి సంబంధించి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు CBDT కొత్త నిబంధనలను తీసుకు రావడం జరిగింది. మరి ఇక ఆ కొత్త రూల్స్ గురించి పూర్తి వివరాలలోకి వెళితే..

కొత్త రూల్స్ ప్రకారం చూస్తే ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షలు దాటితే వాళ్లకి కచ్చితంగా రెండు ప్రావిడెంట్ ఫండ్ PF ఖాతాలు ఉండాలని తెలిపారు. వారి పీఎఫ్ ఖాతాను రెండు భాగాలుగా విభజిస్తారు. ఈ కొత్త రూల్ 2022 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. ఇది ఇలా ఉంటే ఏడాదిలో పీఎఫ్ కంట్రిబ్యూషన్ రూ.2.5 లక్షలు దాటితే.. ఆ అదనపు కంట్రిబ్యూషన్‌పై అర్జించిన వడ్డీ మొత్తంపై పన్ను విధిస్తామని అంది.

అయితే ఇదే దిశలో ఇప్పుడు సీబీడీటీ కొత్త రూల్స్ వచ్చాయి. ట్యాక్సబుల్ కంట్రిబ్యూషన్, నాన్ ట్యాక్సబుల్ కంట్రిబ్యూషన్‌కు వేర్వేరు ఖాతాలు ఉండాలని.. ఇలా ఉంటే ట్యాక్స్ లెక్కింపు ఈజీ అవుతుంది అన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అదనపు పీఎఫ్ కంట్రిబ్యూషన్స్‌పై అర్జించిన వడ్డీపై 2022 ఏప్రిల్ 1 నుంచి పన్ను చెల్లించాల్సి ఉంటుందని సీబీడీటీ చెప్పింది.