ఫేస్ బుక్ లో లైవ్ పెడుతున్నారా? ముందు ఇది చదవండి…!

-

అయిన దానికి.. కాని దానికి ఫేస్ బుక్ లైవ్ ను ఉపయోగిస్తున్నారా? అయితే మీరు చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది.. ఫేస్ బుక్ లైవ్ ను ఉపయోగించే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించండి..

ఈరోజుల్లో వీడియో కాలింగ్ ఫీచర్ అనేది అన్ని ఫోన్లలో అందుబాటులోకి వచ్చింది. ఫేస్ బుక్ లోనూ లైవ్ ఫీచర్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే కదా. అయితే.. దాన్ని అవసరానికి కాకుండా… అనవసర విషయాలకు ఉపయోగించడంతో ఫేస్ బుక్ లైవ్ పై ఫేస్ బుక్ ఆంక్షలు విధించాలనుకుంటోంది.

న్యూజిలాండ్ లోని మసీదుల్లో ఫేస్ బుక్ లైవ్ లో నరమేధం సృష్టించిన సంగతి తెలిసిందే కదా. ఆ సంఘటనతో పాటు గోప్యతా ఉల్లంఘనల ఆందోళనతో ఫేస్ బుక్ లైవ్ ఫీచర్ లో పలు సంస్కరణలు తీసుకురావాలని ఫేస్ బుక్ నిర్ణయించుకుంది. ఇప్పటికే వేర్పాటువాద పోస్టులు, శ్వేత జాతీయ వాద పోస్టులు, వాటికి సంబంధించిన ప్రసంగాలను నిషేదిస్తున్నట్టు ఫేస్ బుక్ ప్రకటించిన విషయం తెలిసిందే కదా.తాజాగా ఫేస్ బుక్ లైవ్ ను మానిటర్ చేయనుందట. దానికి సంబంధించి ఫేస్ బుక్ సీవోవో షెరిల్ శాండ్ బెర్గ్ తన బ్లాగ్ లో ఫేస్ బుక్ లైవ్ పై ఆంక్షలు విధిస్తున్నట్టు పేర్కొన్నారు.



ఫేస్ బుక్ లైవ్ ఫీచర్ ను ఎవరికి అనుమతించాలి.. ఎవరికి అనుమతించకూడదు అన్న అంశాలను తాము పరిశీలిస్తున్నట్టు షెరిల్ తన బ్లాగ్ లో తెలిపారు. అయితే.. ఫేస్ బుక్ లైవ్ పై మాత్రం ఇప్పటి నుంచి మానిటరింగ్ ఉంటుందని.. ఉల్లంఘనలకు పాల్పడిన యూజర్లపై కఠిన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందని ఫేస్ బుక్ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version