పట్టు వదలని విక్రమార్కుడు.. 178 సార్లు ఓడిపోయినా మళ్లీ పోటీ

-

తమిళనాడులోని సేలంకు చెందిన కే పద్మరాజన్… ఇప్పటికి 178 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారట. ఇప్పుడు 179 వ సారి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

ఎవరైనా రెండు మూడు సార్లు ఎన్నికల్లో ఓడిపోతేనే డీలా పడిపోతారు. ఇక.. తమకు రాజకీయాలు నప్పవని వదిలేస్తారు. మనకెందుకురా బాబు ఈ రాజకీయాల గోల అని రాజకీయ సన్యాసం తీసుకుంటారు. ఎందుకంటే.. రాజకీయాల్లో గెలిస్తేనే కిక్కు. ఓడిపోతే ఎవ్వరూ పట్టించుకోరు


. అందుకే రాజకీయ నాయకులు ఎన్నికల్లో గెలవడం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే వ్యక్తి మాత్రం కాస్త డిఫరెంట్. ఆయన వరుసగా ఓడిపోతూ కిక్కును పొందుతున్నాడు. ఓడిపోతూ కూడా ఫేమస్ అయిపోతున్నాడు. ఇదేదో ఆసక్తిగా ఉందే అంటారా? పదండి ఓసారి తమిళనాడు వెళ్లొద్దాం..తమిళనాడులోని సేలంకు చెందిన కే పద్మరాజన్… ఇప్పటికి 178 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారట. ఇప్పుడు 179 వ సారి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ధర్మపురి లోక్ సభ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఎప్పుడు పోటీ చేసినా ఆయన్ను ఓటమి పలకరించడమే. ఇప్పుడు పట్టాలీ మక్కల్ కచ్చీ నాయకుడు అంబుమణి రామ్ దాస్ పై పోటీ చేస్తున్నారు.



వృత్తిరీత్యా హోమియోపతి వైద్యుడైన పద్మరాజన్.. 1988వ సంవత్సరం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారట. పంచాయతీ ఎన్నికల నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు అన్ని ఎన్నికల్లో పోటీ చేసిన పద్మరాజన్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా ఎక్కారు. పెద్ద పెద్ద నాయకులపై కూడా పోటీ చేశారు పద్మరాజన్. 2016 వరకు కేవలం ఎన్నికల్లో పోటీ చేసి 20 లక్షల డిపాజిట్లు కోల్పోయారట ఆయన. 200 సార్లు పోటీ చేయడమే తన ధ్యేయమట. రాహుల్ గాంధీపై కూడా త్వరలో పోటీ చేస్తారట.

ఎన్నికల్లో పోటీ చేయడం రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. అందుకే… ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తా. ఒకవేళ నేను ఓడిపోకుండా గెలిస్తే నాకు గుండెపోటు రావడం ఖాయం.. అంటూ చెప్పుకొచ్చారు పద్మరాజన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version