HDFC: ఇలా చేస్తే యాభై లీటర్ల పెట్రోల్ ఫ్రీగా పొందొచ్చు…!

-

పెట్రోల్ ధరలు భారీగా పెరిగిపోయాయి. దీనితో బండి తీయాలంటేనే చాల మంది సామాన్యులకి కష్టం అయిపోతోంది. ఇటువంటి సమయం లో ఉచితంగా పెట్రోల్, డీజిల్ పొందాలని భావిస్తున్నారా? నిజమేనండి. ఇలా చేస్తే ఫ్రీగా పెట్రోల్ ని మీరు పొందవచ్చు. ఇక అది ఎలాగో ఇప్పుడో తెలుసుకోండి. పూర్తి వివరాల లోకి వెళితే… క్రెడిట్ కార్డు ద్వారా 50 లీటర్ల వరకు ఉచితంగానే ఫ్యూయెల్ పొందొచ్చు. దాని కోసం చూస్తే..ఇండియన్ ఆయిల్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు కలిగిన వారికి ఈ బెనిఫిట్ ఉంది. అది ఎలా అంటే…? ఈ కార్డు ద్వారా రివార్డు పాయింట్లు వస్తాయి. మీరు కనుక ఆ ఫ్యూయెల్ పాయింట్స్ ని రిడీమ్ చేసుకుంటే దీని వల్ల సంవత్సరానికి 50 లీటర్ల వరకు పెట్రోల్ ఫ్రీగా పొందొచ్చు.

ఇప్పుడు లీటరు పెట్రోలు కొన్ని ప్రాంతాల్లో రూ.100 దాటేసింది. డీజిల్ ధర అయితే రూ.90 పైకి చేరింది. దీనితో నిజంగా పెద్ద కష్టం వస్తోంది. మరొక ముఖ్యమైన విషయం ఇది అందరికీ అందుబాటు లో ఉండదు.
ఇండియన్ ఆయిల్ ఔట్‌లెట్స్ ‌లో ఫ్యూయెల్ కొట్టిస్తే 5 శాతం ఫ్యూయెల్ పాయింట్లు పొందొచ్చు.
మీరు ఇలా చేస్తే తొలి ఆరు నెలలు నెలకు గరిష్టంగా 250 ఫ్యూయెల్ పాయింట్లు పొందొచ్చు. ఆ తర్వాత 150 ఫ్యూయెల్ పాయింట్లు వస్తాయి.

అంతే కాదు గ్రాసరీ, బిల్ పేమెంట్స్‌పై నెలకు 100 ఫ్యూయెల్ పాయింట్లు లభిస్తాయి. మిగిలిన వాటిపై రూ.150 ఖర్చు చేస్తే 1 ఫ్యూయెల్ పాయింటు వస్తుంది. అయితే 1 శాతం ఫ్యూయెల్ సర్‌చార్జ్ మినహాయింపు ఉంటుంది. ఫ్యూయెల్ పాయింట్లు 2 ఏళ్ల వరకు వ్యాలిడిటీ కలిగి ఉంటాయి. మీరు ఈ ఆఫర్ పొందాలంటే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉండాలి. నెలకు రూ.10 వేలకు పైగా ఆదాయం ఉన్న వారు ఈ బ్యాంక్ వెబ్‌సైట్‌కు వెళ్లి మీరు ఈ క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news