మీరు ఆధార్‌ ఎక్కడెక్కడ ఉపయోగించారో ఇలా ఈజీగా తెలుసుకోండి..!

-

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు కూడా ఒకటి. ఆధార్ కార్డు లేకపోతే చాలా పనులు అవ్వవు. ప్రభుత్వ పధకాలు మొదలు ఎన్నో వాటికి ఆధార్ కార్డు చాలా అవసరం. అయితే ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలం లో మోసాలు బాగా ఎక్కువగా జరుగుతున్నాయి. చాలా మంది ఆధార్ కార్డ్ దుర్వినియోగం గురించి కూడా ఆందోళన చెందుతున్నారు.

మన ఆధార్ ని ఎవరైనా నకిలీ ఆధార్‌ కార్డును సృష్టించి వాడచ్చు కూడా. ఇలాంటి మోసాలు కూడా ఇప్పటి చాలా జరిగాయి. అయితే మీ ఆధార్ కార్డు ని కూడా ఎవరైనా దుర్వినియోగం చేస్తున్నారా..? అనేది తెలుసుకోవాలి. ఈ విషయాన్ని తెలుసుకునేందుకు యూఐడీఏఐ (UIDAI) అవకాశం కల్పిస్తోంది. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… ఇలా ఈజీగా మీరు మీ ఆధార్ ని ఎవరైనా వాడుతున్నారా లేదా అనేది చూడచ్చు.

దీని కోసం మీరు ముందు ఆధార్ అధికారిక యూఐడీఏఐ ( https://uidai.gov.in ) పోర్టల్ కి వెళ్ళండి.
నెక్స్ట్ మీరు మై ఆధార్‌ సెక్షన్‌లోకి వెళ్లి ఆధార్‌ సర్వీసెస్‌ను సెలెక్ట్ చేసుకోండి.
ఇప్పుడు ఆధార్‌ సర్వీస్‌ సెక్షన్‌లో 8వ వరుసలో కనిపించే ఆధార్‌ అథెంటికేషన్‌ హిస్టరీపై క్లిక్‌ చేయాలి.
ఆధార్‌ నెంబర్‌, క్యాప్చా ఎంటర్‌ చేసి సెండ్‌ ఓటీపీ పై క్లిక్‌ చేయాలి.
ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి హిస్టరీ కావాలో సెలెక్ట్ చేసుకోండి.
ఇక్కడ ఆరు నెలలకు సంబంధించిన సమాచారం మాత్రమే వస్తుంది.
మీ ఆధార్‌కు లింక్‌ అయి ఉన్న ఫోన్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
తర్వాత దానిని ఎంటర్ చెయ్యండి.
ఏ సమయంలో ఎక్కడ ఆధార్ ని వాడారు అనేది తెలిసిపోతుంది.
ఈ వివరాలన్నీ తెలుసుకోవాలంటే కచ్చితంగా మీ మొబైల్ నెంబర్, ఆధార్ కార్డుకు లింక్ చేసుండాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news