15 సంవ‌త్స‌రాల ఆర్‌సిని రెన్యూవల్‌ చేయాడానికి 8 రెట్లు చెల్లించాల్సిందే

-

మీ వద్ద 15 ఏళ్ల పాతబడిన వాహనాలు ఉంటే ఇక మీరు అక్టోబర్‌ నుంచి అధిక ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. ప్రైవేటు వాహనాల రిజిస్ట్రేషన్‌ రెన్యూవల్‌ సైతం ఇక ఆలస్యం చేయకుండా వాహనదారులు జాగ్రత్తపడండి. లేకపోతే రవాణా మంత్రిత్వ శాఖ ఈ వాహనాలపై పెనాల్టీలతో కొరడా ఝళిపించనుంది. మీ వాహనం 15 ఏళ్ల పాతదై ఉంటే, ఒకవేళ రెన్యూవల్‌ చేసుకోవడం ఆలస్యమవుతే మీ వాహనానికి ముసాయిదా ప్రతిపాదన ప్రకారం నెలకు రూ .300 నుంచి రూ .500 జరిమానా విధిస్తుంది.

2021 అక్టోబర్‌ నుంచి రిజిస్ట్రేషన్‌ రెన్యూవల్, 15 ఏళ్ల వాహనం  ఫిట్నెస్‌ సర్టిఫికేట్‌ పొందటానికి మీరు 21 రెట్లు ఎక్కువ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

వాహన స్క్రాపేజ్‌ విధానాన్ని రూపొందించే మొత్తం ప్రణాళికలో భాగంగా రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఈ పెంపును ప్రతిపాదిస్తూ ముసాయిదా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ప్రతిపాదన ప్రకారం, మీ 15 సంవత్సరాల కంటే ఎక్కువ పాతబడిన కారు రిజిస్ట్రేషన్ ను రెన్యూ చేసుకోవాలను కుంటే మీరు 5,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది, ఇది మీరు ప్రస్తుతం చెల్లించే దానికంటే దాదాపు ఎనిమిది రెట్లు ఎక్కువ. అదేవిధంగా, పాత బైక్‌ యొక్క రిజిస్ట్రేషన్‌ పునరుద్ధరణకు ప్రస్తుత రుసుము 300 తో పోలిస్తే రూ. 1,000 ఉంటుంది. 15 సంవత్సరాల పాటు ఫిట్నెస్‌ పునరుద్ధరణ ధ్రువీకరణ పత్రాన్ని పొందడానికి బస్సు లేదా ట్రక్కుకు రూ .12,500 ఉంటుంది, ఇది దాదాపు 21 రెట్లు ఎక్కువ.

ప్రైవేట్‌ వాహనాల ఆర్‌సీ రెన్యూవల్‌ ఆలస్యం అవుతే నెలకు రూ .300 నుంచి 500 రూపాయల జరిమానా వసూలు చేస్తుందని, వాణిజ్య వాహనాలకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ రెన్యూవల్‌కు ఆలస్యం అయిన కారణంగా రోజువారీగా రూ .50 జరిమానాను వర్తిస్తుందని ప్రతిపాదనలో పేర్కొంది.

ప్రైవేట్‌ వాహనాల విషయంలో, యజమానులు 15 సంవత్సరాల తరువాత ప్రతి ఐదేళ్లకోసారి ఆర్‌సిని పునరుద్ధరించాలి. అదేవిధంగా, వాణిజ్య వాహనం ఎనిమిది సంవత్సరాలు చేరుకున్న తర్వాత ప్రతి సంవత్సరం ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌ పునరుద్ధరణ తప్పనిసరి. ఫిట్‌నెస్‌ పరీక్షలో పాస్‌ అయిన తరువాత వాహనాలను స్క్రాప్‌ చేయడానికి సౌకర్యాలు కల్పించడానికి, రిజిస్టర్డ్‌ వెహికల్‌ స్క్రాపింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు మంత్రిత్వ శాఖ ముసాయిదా ప్రమాణాన్ని తీసుకువచ్చింది. ప్రతిపాదన ప్రకారం, వాహన యజమాని పాత వాహనాన్ని ఏదైనా స్క్రాపింగ్‌ కేంద్రానికి తీసుకెళితే ఉచితం, అతను / ఆమె స్క్రాపింగ్‌ సర్టిఫికెట్‌ను ఎవరికైనా బదిలీ చేసి కొత్త వాహనం కొనడానికి ఏదైనా ప్రోత్సాహాన్ని పొందవచ్చు.

పాత కాలుష్య వాహనాలను తొలగించడానికి ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలను ప్రకటించడం ప్రారంభించినందున, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో ఒక నివేదిక ప్రకారం, 10 , 15 సంవత్సరాల డీజిల్‌ నిషేధాన్ని సమీక్షించడానికి ప్రభుత్వం ఎన్జీటీ, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఢిల్లీ తదితర‡ ప్రాంతాలలో పెట్రోల్‌ వాహనాలు. ‘పాత కాలుష్య వాహనాలను తొలగించడానికి ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకువస్తుంటే, అది మొత్తం దేశానికి ఏకరీతిగా ఉండాలి‘ అని వినియోగదారు కార్యకర్త అనిల్‌ సూద్‌ ఉటంకించారు.

Read more RELATED
Recommended to you

Latest news