పసిడి ప్రియులకి బ్యాడ్ న్యూస్.. ధరలు పైపైకి..!

పసిడి ప్రియులకి బ్యాడ్ న్యూస్. మరోసారి బంగారం ధరలు పెరిగాయి. అదే విధంగా వెండి రేట్లు కూడా పెరిగాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు పైకి చేరడంతో దేశీ మార్కెట్‌లోనూ ధరలు పెరుగుతున్నాయి.

ఇక ధరలు ఎంత వున్నాయి అనేది చూస్తే.. హైదరాబాద్ మార్కెట్‌ లో మంగళవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పైకి కదిలింది. దీనితో రూ.50,070కు బంగారం చేరింది.

అలానే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారి లో నడిచింది. రూ.90 పెరుగుదల తో రూ.45,900కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధర పెరిగింది. 0.35 శాతం పైకి కదిలింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1911 డాలర్లకు చేరింది.

వెండి కూడా పరుగులు పెట్టింది. వెండి ధర పైపైకి కదిలింది. రూ.400 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.72,000కు చేరింది. ఇది ఔన్స్‌కు 0.81 శాతం పెరుగుదలతో 28.24 డాలర్లకు ఎగసింది.