ఈరోజు బంగారం ధరలు పెరగలేదు. దీనితో పసిడి ప్రేమికులకు ఊరట కలిగిందని చెప్పాలి.
కానీ వెండి రేటు మాత్రం తగ్గుతూ రావడం జరుగుతోంది. నాలుగు రోజుల నుండి కూడా వెండి రేట్లు తగ్గుతున్నాయి. ఇక బంగారం ధరలు కోసం చూద్దాం.
బంగారం ధరలు స్థిరంగానే వున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధరలు ఎలా వున్నాయి అనేది చూస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.49,750 వద్దనే ఉంది. ఏ మార్పు లేదు. అదే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర అయితే రూ.45,600 వద్ద నిలకడగా వుంది.
ఇది ఇలా ఉంటే అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర 0.55 శాతం పెరిగింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1884 డాలర్లకు చేరింది. వెండి రేటు మాత్రం క్షీణించింది. ఔన్స్‌కు 0.33 శాతం తగ్గుదలతో 27.62 డాలర్లకు దిగొచ్చింది. వెండి ధర రూ.700 దిగొచ్చింది. దీంతో కేజీ వెండి ధర రూ.75,700కు పడిపోయింది.
ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి కారణాల వలన బంగారం పై ప్రభావం పడుతుంది.