నేడే నెల్లూరుకి ఐసిఎంఆర్, నిర్ణయం ఏంటీ…?

-

దేశ వ్యాప్తంగా ఆనందయ్య మందు విషయంలో ఇప్పుడు కాస్త ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఈ మందు ఎప్పుడు అందిస్తారు ఏంటీ అనే దానిపై స్పష్టత రావడం లేదు. ఇక ఇదిలా ఉంటే ఆనందయ్య మందు పరిశీలన కోసం ఇవాళ నెల్లూరుకి ఐసీఎంఆర్ బృందం వస్తుంది. నెల్లూరులోని సమీప బంధువుల ఇంట్లో ఆనందయ్య ఉన్నారు అని అధికారులు మీడియాకు వెల్లడించారు.

పోలీసులు రక్షణ కల్పిస్తున్నట్టుగా పేర్కొన్నారు. ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా, ఇవ్వకున్నా ప్రజలందరికీ మందు చేరడం… వారి ప్రాణాలు కాపాడటమే లక్ష్యమని ఆనందయ్య స్పష్టం చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో మందు పంపిణీకి ప్రభుత్వం అనుమతిచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడా కాస్త ఎక్కువగానే జరుగుతుంది. ఐసిఎంఆర్ బృందం ఏమంటుంది ఏంటీ అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news