ఃఏఏదకు వ్యతిరేకంగా రామ్‌లీలా మైదాన్‌లో శనివారం నిరసన తెలిపారు. దేశ వ్యాప్తంగా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. అలాగే 27 రాష్ట్రాలకు చెందిన ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995 కిందకు వచ్చే పెన్షనర్లు రామ్‌లీలా మైదాన్‌లో నిరసన వ్యక్తం చేశారు. నెలకు కనీస పెన్షన్‌ను రూ.7,500గా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. అయితే పెన్షనర్లు పీఎంవో ఆఫీస్‌కు కూడా వెళ్లారు. అక్కడ అధికారులకు మెమోరాండమ్ కూడా సమర్పించారు.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్లక్ష్యాన్ని తెలియజేశారు. అదే విధంగా, ఈపీఎస్ 95 నేషనల్ ఎజిటేషన్ కమిటీ నేషనల్ జనరల్ సెక్రటరీ వీరేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ప్రభుGoodత్వం వెంటనే స్పందించి తగిన నిర్ణయం తీసుకోకపోతే జనవరి 25 నుంచి సమ్మెకు దిగుతామని తెలిపారు. ప్రస్తుతం ఈపీఎఫ్‌వో సబ్ స్క్రైబర్లు రిటర్మెంట్ తరువాత కనీస పెన్షన్ 2,500 రూపాయలు పొందుతున్నారని తెలుస్తోంది. ఇకపోతే ఉద్యోగుల బేసిక్ వేతనం 12 శాతం ఈపీఎఫ్ అకౌంట్‌లకు వెళ్లిపోతుంది. దీనికి సమానమైన మొత్తాన్ని కంపెనీ కూడా ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో జమచేస్తుంది.