రుణ గ్రహీతలకు శుభవార్త.. 6 నెలలు ఈఎంఐ కట్టక్కర్లేకుండా ఐదు లక్షలు పొందొచ్చు..!

-

కెనరా బ్యాంక్ కస్టమర్స్ కి గుడ్ న్యూస్. కస్టమర్ల కోసం కొత్త లోన్ స్కీమ్స్ ని కెనరా బ్యాంక్ తీసుకు రావడం జరిగింది. హెల్త్ కేర్ క్రెడిట్, బిజినెస్ లోన్, పర్సనల్ లోన్స్ వంటివి తీసుకు రావడమా జరిగింది. దీనితో కస్టమర్స్ కి చాల ప్రయోజనాలు పొందొచ్చు.

ఈ కరోనా టైమ్‌ లో ఇటువంటి వాటి వలన ఊరట లభించనుంది. కస్టమర్స్ కి ఏ విధంగా లాభాలు ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం… ఈ బ్యాంక్ కస్టమర్స్ హెల్త్‌ కేర్ క్రెడిట్ ఫెసిలిటీ కింద రిజిస్టర్డ్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్, డయాగ్నస్టిక్ సెంటర్లు, పాథాలజీ ల్యా్బ్స్, ఇతరులు హెల్త్ కేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి వాటి కోసం రూ.10 లక్షల నుంచి రూ.50 కోట్ల వరకు బ్యాంక్ నుంచి రుణాలు తీసుకోవచ్చు అని బ్యాంక్ తెలిపింది.

తీసుకున్న వాళ్ళు రుణాన్ని 10 ఏళ్లలో తిరిగి కట్టాలి. 18 నెలల వరకు మారటోరియం పొందొచ్చు. అదే విధంగా మెడికల్ ఆక్సిజన్, ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు వంటివి తయారు చేసే సంస్థలకు బ్యాంక్ రూ.2 కోట్ల వరకు రుణాలు కెనరా బ్యాంక్ ఇస్తోంది.

అంతే కాకుండా కెనరా జీవన రేఖ హెల్త్ కేర్ బిజినెస్ లోన్ కింద ఈ తరహా రుణాలు పొందొచ్చు. వీటిపై ఏ ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. రూ.5 లక్షల వరకు పర్సనల్ లోన్స్ కూడా తీసుకోవచ్చు. సెప్టెంబర్ 30 వరకు ఈ స్కీమ్ ని పొందే అవకాశం వుంది. రూ.25 వేల నుంచి రూ.5 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. 6 నెలలు ఈఎంఐ కట్టక్కర్లేదు.

 

Read more RELATED
Recommended to you

Latest news