ఐసీఐసీఐ కస్టమర్స్ కి గుడ్ న్యూస్…!

దేశీయ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు తీపికబురు అందించింది. మరి దీనికి సంబంధించి పూర్తిగా చూస్తే… మర్చంట్ స్టేక్ పేరు తో ఐసీఐసీఐ కొత్త సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీనితో మంచి బెనిఫిట్స్ ని పొందవచ్చు.

ఇది ఇలా ఉంటే గ్రాసరీస్, సూపర్ మార్కెట్స్, లార్జ్ రిటైల్ స్టోర్ చెయిన్స్, ఆన్‌లైన్ బిజినెస్‌లు, లార్జ్ ఈకామర్స్ సంస్థలు బ్యాంక్ నుండి ఈ సర్వీసులని పొందవచ్చు. వీళ్ళు ఏ ఇబ్బంది లేకుండా బ్యాంక్ అందించే సేవలని సులువుగా పొందొచ్చు అని బ్యాంక్ తెలిపింది.

సర్వీసులని ఈజీగా ఇన్‌స్టా బిజ్ అనే బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా రిటైల్ మర్చంట్లు పొందవచ్చు. ఇది ఇలా ఉండగా సూపర్ మర్చంట్ కరెంట్ అకౌంట్… మర్చంట్ ఓవర్ డ్రాఫ్ట్, ఎక్స్‌ప్రెస్ క్రెడిట్.. డిజిటల్ స్టోర్ మేనేజ్‌మెంట్, లాయల్టీ రివార్డ్, వ్యాల్యూ యాడెడ్ సర్వీసెస్ అనే ఐదు రకాల సేవలు పొందొచ్చని బ్యాంక్ తెలిపింది.

అలానే మర్చంట్ స్టేక్ సర్వీసుల కింద రిటైల్ మర్చంట్లు పలు రకాల బ్యాంకింగ్ సేవలను కాంటాక్ట్‌లెస్ పద్ధతి లో పొందొచ్చు. కొంత మంది మర్చంట్లకు అయితే ప్రిఅప్రూవ్డ్ ఆఫర్లు కూడా ఉంటాయి. రూ.25 లక్షల వరకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ పొందొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ పీఓఎస్ మెషీన్‌ను లింక్ చేసుకోవాలి అని బ్యాంక్ తెలిపింది.