గంటల పాటు పీపీయీ కిట్లో… డాక్టర్ ఎలా మారాడో చూడండి !

ప్రతి రోజూ మూడు లక్షలకు పైగా కోవిడ్ -19 కేసులు భారత్ లో నమోదు అవుతున్నాయి. నిన్నటితో రెండు లక్షల మార్కును దాటిన మరణాల సంఖ్యతో ఈ మహమ్మారి రెండవ వేవ్ భారతదేశాన్ని కలవర పెడుతోంది. ఈ సంక్షోభం వేగంగా పెరిగేకొద్దీ, దేశంలో వైద్య మౌలిక సదుపాయాలు దాదాపు పతనం అంచుకు చేరుతున్నాయి. తత్ఫలితంగా, ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు ప్రతి రోజూ తీవ్ర దారుణ పరిస్ధితులు ఎదుర్కొంటున్నారు.

ఈ దారుణ సమయంలో పౌరులను రక్షించడానికి తమ వంతు కృషి చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేయబడిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది. ఆ పోస్ట్ ప్రకారం ఒక వైద్యుడు 15 గంటల పాటు నిరంతరాయంగా పీపీయీ కిట్ ధరించడం వల్ల ఇలా అయ్యాను అంటూ బిఫోర్, ఆఫ్టర్ ఫోటోలు షేర్ చేశారు. ఆ రెండో ఫోటోలో ఆయన చెమటలో తడిసినట్లు కనబడుతుంది, ప్రస్తుతం ఈ పిక్ ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది.