ఇండేన్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు తీపికబురు…!

మీరు ఇండేన్ గ్యాస్ సిలిండర్ ని ఉపయోగిస్తారా…? అయితే మీకు గుడ్ న్యూస్. తాజాగా ఇండియన్ ఆయిల్ ఈ గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంది. దీనితో ఇండేన్ గ్యాస్ వాడుతున్న వారికి ఊరట కలగనుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… కొత్త గ్యాస్ సిలిండర్లను మార్కెట్‌ లోకి తీసుకు వచ్చింది. అయితే వీటి పేరు ఇండేన్ ఎక్స్‌ట్రా తేజ్ సిలిండర్లు.

అవి ఎలా పని చేస్తాయి…?, లాభం ఏమిటి అంటే…? వీటి వల్ల రెండు రకాల ప్రయోజనాలు పొందొచ్చు. ఇండేన్ ఎక్స్‌ట్రా తేజ్ సిలిండర్ వాడటం వల్ల 5 శాతం వరకు గ్యాస్ ఆదా చేసుకోవచ్చు. పైగా వంట కూడా ఫాస్ట్ గా చేసుకోవచ్చట. ఈ సిలిండర్లు బ్లూ కలర్ లో ఉంటాయి. అయితే ఈ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లను కేవలం కమర్షియల్ సిలిండర్ ఉపయగించే వారు మాత్రమే ఉపయోగించుకోవడం వీలవుతుంది గమనించండి.

దీనికి అర్ధం ఏమిటంటే.. ఇంటిలో ఈ గ్యాస్ సిలిండర్‌ను ఉపయోగించడం కుదరదు. ఇవి 14.2 కేజీల సిలిండర్ రూపంలో అందుబాటులో లేవు. ఈ విషయాన్ని స్వయంగా ఇండియన్ ఆయిల్ ట్విట్టర్ వేదికగా పేర్కొంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లోనే ఈ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా ఈ సిలిండర్లు అందుబాటులోకి వస్తాయి.

ఈ సిలిండర్లు గ్యాస్‌ను ఎక్కువ ప్రెజర్‌ తో పంపిస్తుంది. దీంతో గ్యాస్‌ 5 శాతం వరకు సేవ్ చేసుకోవడానికి వీలు అవుతుంది. 19 కేజీలు, 47.5 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వాడే వారు ఈ సిలిండర్లను వాడొచ్చు పైగా మంచి లాభాలు కూడా పొందవచ్చు. మీ డిస్ట్రిబ్యూటర్ దగ్గరి నుంచి ఈ సిలిండర్లను పొందొచ్చు.