కరోనా వైరస్ మహమ్మారి అయ్యి ప్రజల్ని పట్టిపీడిస్తోంది. ఇటువంటి సమయంలో ఆరోగ్యంగా ఉండడం ఎంతో ముఖ్యం. మరీ ముఖ్యంగా ఆక్సిజన్ లెవెల్స్ సరిగ్గా ఉండేటట్టు ఇమ్యూనిటీ సరిగ్గా ఉండేటట్లు చూసుకోవడం ప్రథమం. ఈ రెండూ సరిగ్గా ఉండాలంటే డైట్లో ఈ ఆహారాన్ని తప్పక తీసుకోండి.
ఈ ఆహారం తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ మరియు ఆక్సిజన్ లెవెల్స్ బాగుంటాయని హార్వర్డ్ హెల్త్ అండ్ ఫుడ్ అండ్ ద డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అమెరికా చెప్పడం జరిగింది. అదే విధంగా హెమోగ్లోబిన్ కూడా సరిగ్గా మెయింటైన్ చేయడానికి వీలవుతుంది.
దాని కోసం మీరు కాపర్, ఐరన్, విటమిన్ సి మరియు ఫోలిక్ యాసిడ్ ఉండేటట్టు చూసుకోవాలి. ఈ పోషకాలు మీ డైట్ లో తీసుకుంటే బ్లడ్ లో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి.
బంగాళదుంపలు, నువ్వులు జీడిపప్పు మరియు పుట్టగొడుగుల్లో కాపర్ అధికంగా ఉంటుంది. ఐరన్ కోసం బీన్స్, ఆకుకూరలు, చికెన్, మాంసం లాంటివి తీసుకుంటే వస్తుంది.
గుడ్లలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. చిలకడ దుంపలు, క్యారెట్, మామిడి, పాలకూర లో కూడా విటమిన్స్ ఉంటాయి.
ఓట్స్, పెరుగు, గుడ్లు, బాదం, చీజ్, బ్రెడ్ మరియు పాలు కూడా తీసుకోవచ్చు. వీటి ద్వారా రైబోఫ్లెవిన్ అందుతుంది.
విటమిన్ బి3 కోసం మీరు గింజలు, పల్లీలు తీసుకోవచ్చు. విటమిన్ బి5 కోసం చికెన్, చేపలు, గుడ్లు తీసుకోవచ్చు. బ్రోకలీ, అవకాడో, బ్రౌన్ రైస్, వేరుశనగ, పుట్టగొడుగుల్లో కూడా విటమిన్ బి5 ఉంటుంది.
చికెన్, చేపలు, పాలకూర, అరటిపండ్ల లో B6 మరియు B9 ఉంటుంది. వెల్లుల్లిని డైట్ లో తీసుకోవడం వలన ఆక్సిజన్ లెవెల్స్ పెరగడానికి వీలవుతుంది.
నిమ్మ ద్వారా విటమిన్ సి అందుతుంది. దీనిని కూడా మీ డైట్ లో చేర్చుకోండి దీని కారణంగా చాలా వ్యాధులు తగ్గుతాయి మరియు ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెరగడానికి వీలవుతుంది.