వరంగల్ లో పిట్టల్లా రాలిపోతున్న జనాలు

-

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తుంది. రోజుకు వందల్లో నమోదవుతున్న కేసులతో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రుల కొరత కూడా చాలా ఎక్కువగా ఉంది. పదుల సంఖ్యలో జనం మృత్యువాత పడుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత చాలా ఎక్కువగా ఉంది. ఆక్సిజన్ తెచ్చుకుంటేనే వైద్యం చేస్తామని ఆస్పత్రులు చెప్తున్నాయి.

వరంగల్ ఎంజీఎంలోనూ ఆక్సిజన్ నిల్వలు లేవు. మూడు ఆక్సిజన్ ప్లాంట్లకు ముడి సరుకు కొరత ఎక్కువగా ఉంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్ల కొరత తీవ్రంగా ఉంది. వరంగల్ లో గ్రేటర్ ఎన్నికలతో కరోనా మరింత విజృంభించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వృద్దులు బాగా ఇబ్బందులు పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news