రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక ఇంటి వద్దకే లగేజ్ డెలివరీ..!

-

ట్రైన్ ప్యాసింజర్లకు ఒక శుభవార్త అందబోతోంది. రైల్వే ప్రయాణికులు లగేజ్ డెలివరీ, పికప్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ వార్త చాలా మందికి ఊరట కలిగిస్తుంది. ఇక మీదట ఈ కొత్త సర్వీసులతో ప్రయాణికులు సులభంగా లగేజ్ ‌ను ట్రాన్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. ఎక్కువగా ట్రైన్ జర్నీ చేస్తున్నవారికి ఎప్పుడొక్కసారి అయినా లగేజ్ అంశం చిరాకు కలిగించే ఉంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి వేరే ఊరికి వెళ్లేటప్పుడు లగేజ్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి సందర్భంలో మీ లగేజ్‌ను ఇంటి వద్ద నుండే రైల్వే స్టేషన్‌కు లేదా రైల్వే స్టేషన్ నుంచి ఇంటి వద్దకు తీసుకెళ్లాలంటే కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. లేదంటే లగేజ్ కోసం ఎక్కువ చార్జీలు చెల్లించుకోవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ ట్రైన్ ప్యాసింజర్లకు ఒక తీపికబురు అందించింది. లగేజ్ సర్వీసులు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది ఇండియన్ రైల్వేస్.

నార్త్ రైల్వే‌కు చెందిన ఢిల్లీ డివిజన్ ఇప్పటికే లగేజ్ సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. రైల్వేస్ తమ ఆదాయాన్ని పెంచుకోవాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. రైల్వే ప్రయాణికులు బీఓడబ్ల్యూ యాప్ ద్వారా ఈ సర్వీసులను పొందవచ్చు. ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని ప్రయాణికులు ఇంటి వద్ద నుంచి రైల్వే స్టేషన్ ‌కు లేదంటే రైల్వే స్టేషన్ నుంచి ఇంటి వద్దకు లగేజ్ సులభంగానే తెచ్చుకోవచ్చు. న్యూఢిల్లీ, న్యూఢిల్లీ జంక్షన్, హజ్రత్ నిజాముద్దిన్, ఢిల్లీ కంటోన్మెంట్, ఢిల్లీ సరాయ్ రోహిల్లా, ఘజియాబాద్, గురుగావ్ రైల్వే స్టేషన్లలో ఈ సర్వీసులు మొదటగా అందుబాటులో ఉంటాయి.

ఆ తర్వాత క్రమక్రమంగా ఇతర స్టేషన్లకు ఈ సేవలు అందుబాటులోకి తీసుకొస్తారు. దీని వల్ల రైల్వేస్ ఆదాయం పెరగనుంది. ప్రయాణికులు డోర్ స్టెప్ లగేజ్ సర్వీసులు కోసం కొంత నామమాత్రపు చార్జీలు చెల్లించాలని నార్త్ రైల్వేస్ తెలిపింది. డోర్ టు డోర్ సర్వీస్ సంస్థ ప్రయాణికుల లగేజ్ ట్రాన్స్‌పోర్ట్ బాధ్యతలను చూసుకుంటుంది. ఈ సేవలు ద్వారా సీనియర్ సిటిజన్స్, వికలాంగులు, మహిళలకు బాగా ఉపయోగం కలుగుతుందని చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news