మనం పోస్టాఫీసులో అలాగే బ్యాంకుల్లో పొదుపు ఖాతా తెరవవచ్చు. మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండానే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాను ప్రారంభించడం వల్ల లక్షలాది మంది లబ్ధి పొందుతున్నారు. అయితే, బ్యాంక్ ఖాతా లాగా, నిర్దిష్ట కాలానికి ఎటువంటి కార్యాచరణ లేకపోతే పోస్టాఫీసు ఖాతా నిష్క్రియం అవుతుంది. ఈ ఖాతాను నిశ్శబ్ద ఖాతా అంటారు. ఈ ఖాతా నుండి వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాల పాటు డబ్బు డిపాజిట్ చేయకపోతే లేదా విత్‌డ్రా చేయకపోతే అది నిశ్శబ్ద ఖాతా అవుతుంది. మరి ఈ ఖాతాను మళ్లీ యాక్టివేట్ చేయడం ఎలా..?
- పోస్టాఫీసు నిశ్శబ్ద ఖాతాను మళ్లీ యాక్టివేట్ చేయవచ్చు. అందుకు సంబంధిత పోస్టాఫీసుకు వెళ్లి మళ్లీ
- దరఖాస్తు చేసుకోవాలి. మళ్లీ KYC రికార్డ్‌తో పాటు. పాస్ బుక్ సమర్పించాలి.
- పోస్టాఫీసులో సేవింగ్స్ ఖాతా తెరవాలంటే రూ.500 డిపాజిట్ చేయాలి.
- ప్రస్తుతం ఈ సేవింగ్స్ ఖాతాలో ఉన్న డబ్బు రూ. 4% వడ్డీ లభిస్తుంది.
- మీరు ఒకేసారి మీ ఖాతాలో జమ చేయగల కనీస మొత్తం రూ. 10. అంటే రూ.10 కంటే తక్కువ మీ ఖాతాలో డిపాజిట్ చేయలేరు.
- మీరు విత్‌డ్రా చేసుకునే మొత్తం రూ.50 కంటే ఎక్కువ ఉండాలి.
- డిపాజిట్ చేయడానికి పరిమితి లేదు. ఖాతాలో ఎంత డబ్బు అయినా జమ చేయవచ్చు.
- ప్రతి నెల 10వ తేదీ నుండి నెలాఖరు వరకు కనీస బ్యాలెన్స్ మొత్తానికి వడ్డీ చెల్లించబడుతుంది.
- అయితే, ఈ మొత్తం రూ. 500 కంటే తక్కువ ఉంటే, అప్పుడు ఎలాంటి వడ్డీ లభించదు.
- పోస్టాఫీసు ఖాతాలో కనీస నిల్వ రూ.500 ఉండాలి. లేదంటే ఏడాదికి రూ.50 జరిమానా విధిస్తారు.
- బ్యాంకులాగా ప్రతి నెలా ఎలాంటి జరిమానా ఉండదు. జీరో బ్యాలెన్స్ ఉంటే పోస్టాఫీసు ఖాతా మూసివేయబడుతుంది.
పోస్ట్‌ఆఫీస్‌లో వివిధ రకాలు స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటన్నింటికి ప్రీమియం చెల్లించాలంటే పోస్ట్‌ఆఫీస్ అకౌంట్ ఉండాల్సిందే. కాబట్టి ఖాతాను ఎప్పుడు యాక్టివ్‌లోనే ఉంచుకోవాలి.