మొబైల్ పోయిందా? నో టెన్షన్.. మొబైల్ ఎక్కడికీ పోదు.. ఇలా ట్రాక్ చేయండి..!

-

ఒకవేళ దురదృష్టవశాత్తు మీ ఫోన్ పోతే.. వెంటనే 14422 హెల్ప్‌లైన్ నెంబర్‌కు కాల్ చేయండి. వెంటనే కొత్త సాఫ్ట్‌వేర్ ద్వారా మీ మొబైల్ ఎక్కడుందో పసిగట్టేస్తారు.

మీ మొబైల్ పోయిందా? టెన్షన్ పడకండి.. అస్సలు టెన్షన్ వద్దు. రిలాక్స్‌డ్‌గా ఉండండి. ఎందుకంటే.. మీ ఫోన్ ఎక్కడుందో ఈజీగా ట్రాక్ చేయొచ్చు. కొత్త సాఫ్ట్‌వేర్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ సరికొత్త సాఫ్ట్‌వేర్‌తో ఫోన్ ఎక్కడుందో తెలుసుకొని వెంటనే దాన్ని బ్లాక్ చేసుకోవచ్చు. మీ మొబైల్‌ను దొంగలించిన వాళ్ల భరతం కూడా పట్టొచ్చు. అంతే కాదు.. మొబైల్ దొంగతనాల ఫిర్యాదుల కోసం కేంద్ర ప్రభుత్వం సపరేట్ హెల్ప్‌లైన్ నెంబర్‌ను కూడా ప్రారంభించింది.

ఒకవేళ దురదృష్టవశాత్తు మీ ఫోన్ పోతే.. వెంటనే 14422 హెల్ప్‌లైన్ నెంబర్‌కు కాల్ చేయండి. వెంటనే కొత్త సాఫ్ట్‌వేర్ ద్వారా మీ మొబైల్ ఎక్కడుందో పసిగట్టేస్తారు.

ఈ సాఫ్ట్‌వేర్‌ను మొదటగా మహారాష్ట్రలో ప్రారంభించారు. అక్కడ ఇది సక్సెస్ అయింది. దీంతో అన్ని రాష్ర్టాల్లో ఈ వ్యవస్థను ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రతి రాష్ట్రంలోని పోలీసుల వద్ద ఈ సాఫ్ట్‌వేర్ ఉంది కానీ.. దాన్ని అధికారికంగా ప్రారంభించాల్సి ఉంది.

మొబైల్‌ను ఎలా ట్రాక్ చేస్తారంటే?

మీ మొబైల్ దొంగలించబడితే.. వెంటనే మీరు 14422 నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తారు. ఆ ఫిర్యాదును వెంటనే మొబైల్ కంపెనీకి చేరవేస్తారు. మొబైల్‌ను దాని ఐఎమ్‌ఈఐ నెంబర్ ద్వారా కంపెనీ బ్లాక్ చేస్తుంది. దీంతో ఆ ఫోన్ పనిచేయదు. కంపెనీ నుంచి సంబంధిత మొబైల్ ఐఎంఈఐ నెంబర్ తీసుకొని.. కొత్త సాఫ్ట్‌వేర్ ద్వారా ఆ ఫోన్ ఎక్కడుందో కనిపెట్టేస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version