బంగ్లా పోరాడింది.. అయినా ఓట‌మి త‌ప్ప‌లేదు..!

-

ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ 2019 టోర్నీలో ఇప్పటి వ‌రకు అనేక మ్యాచ్‌లు జ‌రిగాయి. కానీ నిజంగా బంగ్లాదేశ్ చూపిన పోరాట ప‌టిమ‌ను ఇంత వ‌ర‌కు ఏ టీం చూపించ‌లేదు. ఇవాళ ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో చేయాల్సిన ప‌రుగులు భారీగా ఉన్నా ఏ మాత్రం ఆత్మ‌విశ్వాసం కోల్పోకుండా బంగ్లాదేశ్ అద్భుత‌మైన ప్ర‌దర్శ‌న చేసింది. ఛేద‌న అంటే ఇలా ఉండాలి అని నిరూపించింది. అయిన‌ప్ప‌టికీ ఆ టీంకు ఓట‌మి త‌ప్ప‌లేదు. ఈ క్ర‌మంలో ఆసీస్ బంగ్లాదేశ్‌పై 48 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

ఇవాళ నాటింగామ్‌లో బంగ్లాదేశ్ తో జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆస్ట్రేలియా 50 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల నష్టానికి 381 పరుగుల భారీ స్కోరు చేసింది. కాగా ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (147 బంతుల్లో 166 పరుగులు, 14 ఫోర్లు, 5 సిక్సర్లు), ఉస్మాన్ ఖవాజా (72 బంతుల్లో 89 పరుగులు, 10 ఫోర్లు), కెప్టెన్ ఆరోన్ ఫించ్ (51 బంతుల్లో 53 పరుగులు, 5 ఫోర్లు, 2 సిక్సర్లు)లు రాణించారు. ఇక బంగ్లాదేశ్‌ బౌలర్లలో సౌమ్యా సర్కార్‌కు 3 వికెట్లు ద‌క్కాయి. అలాగే మ‌రో బౌల‌ర్ ముస్తాఫిజుర్ రహమాన్ కు 1 వికెట్ ద‌క్కింది.

త‌రువాత 382 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ దూకుడుగానే ఆడిన‌ప్ప‌టికీ వికెట్లను కూడా కోల్పోయింది. దీంతో ఆ జట్టుకు ల‌క్ష్యం ఛేదించ‌డం క‌ష్ట‌త‌ర‌మైంది. ఫ‌లితంగా బంగ్లా జ‌ట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 333 పరుగులు మాత్ర‌మే చేసి ఓట‌మి పాలైంది. కాగా బంగ్లా బ్యాట్స్‌మెన్లలో ముష్ఫికుర్ రహీం (97 బంతుల్లో 102 పరుగులు, 9 ఫోర్లు, 1 సిక్సర్), తమీమ్ ఇక్బాల్ (74 బంతుల్లో 62 పరుగులు, 6 ఫోర్లు), మహ్మదుల్లా (50 బంతుల్లో 69 పరుగులు, 5 ఫోర్లు, 3 సిక్సర్లు)లు రాణించారు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్, నాథన్ కౌల్టర్ నైల్, మార్కస్ స్టాయినిస్‌లు తలా 2 వికెట్లు తీశారు. ఆడం జంపాకు 1 వికెట్ దక్కింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version