టీడీపీకి ఇలా రాజీనామా చేశారు.. అలా బీజేపీలో చేరారు.. షాక్‌లో చంద్రబాబు..!

-

టీడీపీకి గుడ్‌బై చెప్పి అట్నుంచటే బీజేపీ ప్రధాన కార్యాలయం వెళ్లి.. అక్కడ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఇది విచిత్రమా? లేక ఇంకేమన్ననా? టీడీపీకి ఇలా రాజీనామా చేశారు.. అలా బీజేపీలో చేరారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు తాము టీడీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఇలా లేఖ ఇచ్చారు. అలా వెళ్లి బీజేపీలో చేరారు.

టీడీపీకి గుడ్‌బై చెప్పి అట్నుంచటే బీజేపీ ప్రధాన కార్యాలయం వెళ్లి.. అక్కడ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్.. ఈ ముగ్గురు బీజేపీలో చేరారు. ఈసందర్భంగా జేపీనడ్డా.. వీళ్లకు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మరో ఎంపీ గరికపాటి మోహన్‌రావు.. అనారోగ్య కారణాల దృష్ట్యా బీజేపీలో చేరలేదు. త్వరలోనే ఆయన కూడా బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ దెబ్బతో టీడీపీకి కోలుకోలేని షాక్ తగిలింది. రాజ్యసభలో ఉన్న ఆరుగురు టీడీపీ ఎంపీల్లో నలుగురు బీజేపీలో చేరడంతో టీడీపీకి ఇద్దరే మిగిలారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version