హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్ న్యూస్… కొత్త సర్వీసుల వివరాలు ఇవే…!

-

హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్ న్యూస్..! ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్ల కోసం ఈఎంఐ చెల్లింపులను మరింత సులభతరం చేసింది. వివరాలని చూస్తే.. కొత్త సేవలు తీసుకు రావడం తో కస్టమర్లకు ఊరట లభించనుంది. దీని వల్ల లోన్ తీసుకున్న వారికి మరెంత బెనిఫిట్ ఉండనుంది. ఇక వివరాల లోకి వెళితే… హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. సీఎస్‌సీ ఇగవర్నెన్స్ సర్వీసెస్‌తో పార్ట్నర్ షిప్
కుదుర్చుకున్నట్లు తెలిపింది.

దీనితో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఈఎంఐ కలెక్షన్ సేవలను ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ సర్వీసులు గురించి చూస్తే.. ఇవి దేశ  వ్యాప్తంగా అందుబాటులో ఉంటాయని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తెలియజేయడం జరిగింది. దీనితో కస్టమర్లు వారి ఓవర్‌డ్యూ అమౌంట్‌ను సులభంగానే చెల్లించొచ్చు. బకాయిలు చెల్లించడానికి కస్టమర్లు వారికి దగ్గరిలో ఉన్న సీఎస్‌సీ సెంటర్‌కు వెళ్లి చెల్లించొచ్చు.

కస్టమర్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు వెళ్ళక్కర్లేదు. రెగ్యులర్ ఈఎంఐలతో పాటు ఈఎంఐ మిస్ అయినా చార్జీలతో కలిసి ఈఎంఐ చెల్లించడానికి బ్యాంక్ కి వెళ్ళక్కర్లేదు. కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి పే చేసేయొచ్చు. వెహికల్ లోన్, టూవీలర్ లోన్, పర్సనల్ లోన్, బిజినెస్ లోన్ ఇలా ఏడైన సరే సీఎస్‌సీ సెంటర్ల లో చెల్లించొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version