బైక్, స్కూటర్ కొనాలనుకునే వారికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అదిరే ఆఫర్స్..!

ఇక పండుగ సీజన్ స్టార్ట్ అవుతోంది. దీనితో చాలా బ్యాంకులు తమ కస్టమర్స్ కోసం ఆఫర్స్ ని ప్రకాయించాయి. వీటిని వినియోగించుకుని కస్టమర్స్ డబ్బులుని ఆదా చేసుకోచ్చు. ఇది ఇలా ఉంటే ఈ పండుగ సీజన్ లో కొత్తగా బైక్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా..? లేదా మీరు ఏదైనా కొత్త స్కూటర్ ని కొనాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అదిరిపోయే ఆఫర్ ని అందుబాటు లోకి తీసుకు రావడం జరిగింది.4

hdfc bank
hdfc-bank

కనుక ఈ ఆఫర్ ని వినియోగించుకుని డబ్బులని ఆదా చేసుకోండి. ఇక ఆ ఆఫర్ గురించి చూస్తే.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజాగా ఫెస్టివ్ ట్రీట్స్ 3.0 ప్రకటించింది. ఇందులో భాగంగా టూవీలర్ కొనుగోలు చేసే వారికి అదిరే ఆఫర్లు ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లు అయితే 4 శాతం వరకు తక్కువ వడ్డీకే టూవీలర్ లోన్ పొందొచ్చు. అలానే ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం తగ్గింపు లభిస్తుంది.

ఒకవేళ కనుక ఇతర బ్యాంక్ కస్టమర్లకు అయితే తొలి మూడు నెలలు 50 శాతం తక్కువ ఈఎంఐ చెల్లించొచ్చు. లోన్ ఆన్ కేవైసీ బెనిఫిట్ ఉంది. ఈ ఆఫర్ ని నవంబర్ చివరి వరకే అందుబాటులో ఉంటుంది గమనించండి. టూవీలర్ వ్యయంలో 80 శాతం నుంచి 100 శాతం వరకు మొత్తాన్ని రుణం రూపంలో పొందొచ్చు. ఇది ఇలా ఉంటే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫెస్టివ్ ట్రీట్స్‌లో భాగంగా పలు రకాల ఆఫర్లు కూడా అందిస్తోంది. ఐఫోన్‌పై క్యాష్‌బ్యాక్ ఉంది. ఇంకా చాలా బ్రాండ్లపై తగ్గింపు వుంది కనుక ఆ ఆఫర్లు కూడా వినియోగించుకుంటే మంచిది.