మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో పాన్ కార్డు కూడా ఒకటి. ఎన్నో వాటికి పాన్ కార్డు మనకి ఉపయోగపడుతుంది. అయితే మీరు ఏవైనా ఆర్థిక లావాదేవీల కోసం ఇతరుల పాన్ కార్డ్ తీసుకున్నారా..? ఆ కార్డు నకిలీదో నిజమైనదో తెలియడం లేదా..? అయితే మీరు ఇలా ఈజీగా పాన్ కార్డు నకిలీదో కాదో తెలుసుకోచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే…
ఇది తెలుసుకోవడానికి మీ వద్ద స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు. అప్పుడు ఈజీగా పాన్ కార్డు నకిలీదో కాదో తెలుసుకోవడానికి అవుతుంది. ఇది తెలుసుకోవడానికి మీ ఫోన్ లో ఆదాయపు పన్ను ఎన్ఎస్‌డీఎల్ ఇ-గవర్నెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ రూపొందించిన PAN QR Code Reader యాప్ ఉండాలి. దీనితో ఈజీగా పాన్ కార్డు గురించి తెలుసుకోవచ్చు.
అయితే మీరు ఈ యాప్ ని మీ ఫోన్ లోకి ఇంస్టాల్ చేసేముందు డెవలపర్ దగ్గర NSDL e-Governance Infrastructure Limited అని ఉంటుంది చూడండి. అది ఉంటేనే డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే చాలా యాప్స్ వున్నాయి కనుక. స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయిన PAN QR Code Reader యాప్ ఓపెన్ చేయండి.
కెమెరా వ్యూఫైండర్‌లో గ్రీన్ కలర్ ప్లస్ లాంటి గ్రాఫిక్ కనిపిస్తుంది. మీరు ఇప్పుడు ఆ గుర్తును పాన్ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ పైన వచ్చేలా ఫోన్ ని పట్టుకోండి. ఇలా మీరు ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చెయ్యచ్చు. పాన్ కార్డు వ్యక్తి తాలూకా వివరాలు మీరు చూడచ్చు. స్కానింగ్ పూర్తైన తర్వాత పాన్ కార్డ్ హోల్డర్ వివరాలు కనిపిస్తాయి. ఒకవేళ వివరాలేవీ కనిపించకపోతే అది నకిలీ పాన్ కార్డుగా భావించాలి.