తూర్పు గోదావరి జిల్లా : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరో లేఖ రాశారు. ఓటిఎస్ స్కీమ్ పేరుతో పేద ప్రజలపై ఒత్తిడి తేవద్దని, గత ప్రభుత్వ హాయంలో చేసిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు వెంటనే చెల్లించాలని లేఖ ద్వారా కోరారు ముద్రగడ పద్మనాభం.
గత ప్రభుత్వం హయాంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించని మీకు గత ప్రభుత్వాలు పేదలకు కట్టి ఇచ్చిన ఇళ్లకు ఓటిఎస్ వసూలు చేసే అధికారం ఎక్కడిదని లేఖలో సి.ఎం జగన్ మోహన్ రెడ్డిని నిలదీశారు ముద్రగడ పద్మనాభం.
ఇది ఇలా ఉండగా.. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంలో కీలక మార్పులుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి రెండు వాయిదాల్లో ఓటీఎస్ కట్టే వెసులుబాటు కల్పిస్తూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఓటీఎస్ కింద చెల్లించాల్సిన రుసుములుకు సంబంధించిన సవరణలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.