చనిపోయిన వారి అకౌంట్‌లో డబ్బులు ఎలా పొందాలి?

బ్యాంక్ లో అందరు డబ్బులు దాస్తూనే వుంటారు. కొందరు అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్స్ లాంటివి కూడా ఓపెన్ చేస్తూ వుంటారు. ఒకవేళ కనుక ఇలా ఎఫ్డీ కలిగి వున్నా వ్యక్తి మరణిస్తే ఆ డబ్బులని ఎలా పొందొచ్చు అనేది చూద్దాం. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే….

ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఒకే వ్యక్తి పేరుపై ఉండి ఆ వ్యక్తి మరణిస్తే అది కనుక నామినీ పేరు రిజిస్టర్ అయ్యి ఉంటే.. అప్పుడు నామినీకి ఆ డబ్బులు వస్తాయి. డెత్ సర్టిఫికెట్ అందిస్తే సరిపోతుంది. అదే నామినీ పేరు లేకపోతే అప్పుడు వారసత్వ సర్టిఫికెట్ అందించాల్సి ఉంటుంది.

దీనితో ఈజీగా నామినీ ఆ డబ్బులని పొందవచ్చు. అదే ఒకవేళ కనుక జాయింట్ అకౌంట్ అయితే.. ఒక వ్యక్తి మరణిస్తే.. మరో వ్యక్తికి డబ్బులు అందజేస్తారు. ఒకవేళ జాయింట్ ఎకౌంట్ వున్నా ఇద్దరు మరణిస్తే అప్పుడు ఆ డబ్బు నామిని పొందొచ్చు. నామినీ లేకపోతే వారసులకు డబ్బులు అందుతాయి.
గమనించండి.

కనుక బ్యాంక్ ఖాతా కలిగిన వారు మరణిస్తే ఆ డబ్బుని అప్పుడు నామినీకి అధికారం ఉంటుంది. ఇలా ఆ డబ్బు వాళ్ళు పొందవచ్చు. బ్యాంక్ నామినీకే డబ్బులు అందిస్తుంది. నామినీ లేకపోతే వారసులకు ఆ డబ్బులు లభిస్తాయి. కాబట్టి తప్పకుండ అకౌంట్ కలిగిన వారు నామినీని రిజిస్టర్ చేసుకోవాలి. దీనితో వాళ్ళు మరణిస్తే నామినీకి డబ్బులు వెళ్తాయి.