కోవిడ్ 19: సెకండ్ డోస్ ఎందుకు ముఖ్యమో తెలుసుకోండి.

-

సెకండ్ వేవ్ విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో వ్యాక్సినేషన్ ఒక్కటే దాని నివారణకి మార్గమని అందరూ నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని చూస్తున్నారు. ఐతే వ్యాక్సిన్ కొరత తీవ్ర ఇబ్బందులు పెడుతుంది. దేశంలోని ప్రజలందరికీ వ్యాక్సిన్ వేస్తామని, ఈ సంవత్సరం చివరికల్లా 200కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. అది పక్కన పెడితే ప్రస్తుతం దేశంలో సెకండ్ డోస్ కొరత కూడా ఉంది. ముఖ్యంగా కోవాక్సిన్ తీసుకున్నవారికి సెకండ్ డోస్ దోరకట్లేదని వార్తలు వస్తున్నాయి.

మొదటి డోస్ తీసుకున్న తర్వాత రెండవ డోస్ చాలా ముఖ్యం. అది కూడా సరైన సమయంలో తీసుకోవడం మరీ ముఖ్యం. సెకండ్ డోస్ ఎందుకు ముఖ్యమో ఇప్పుడు తెలుసుకుందాం. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ చెప్పిన దాని ప్రకారం, నిజానికి మొదటి డోస్ వల్ల రోగనిరోధక శక్తి పెరగదు. అది రోగనిరోధక శక్తిని ఉత్తేజపరుస్తుంది. శరీరంలో ప్రతిరక్షకాలు పెరగడానికి పురికొల్పుతుంది. అదే సెకండ్ డోస్ తీసుకుంటే ప్రతిరక్షకాలు ఉత్పత్తి అవుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

యాంటీబాడీస్ ఉత్పత్తి కావడంతో వైరస్ పై పోరాడే గుణం పెరుగుతుంది. అందుకే సెకండ్ డోస్ చాలా ముఖ్యం. అదీగాక ఆ ప్రతిరక్షకాలు ఎక్కువ కాలం ఉండడానికి సెకండ్ డోస్ బాగా పనిచేస్తుంది. అందువల్ల రెండు డోసులు కూడా ఎంతో ముఖ్యమైనవి. రెండు డోసులు వేసుకుంటేనే కోవిడ్ నుండి సంపూర్ణమైన సురక్ష లభిస్తుంది.

సెకండ్ డోస్ తీసుకున్న తర్వాత దొరికే కొన్ని వెసులుబాటులు

ఇంట్లో ఉన్నప్పుడు మాస్క్ పెట్టుకోవాల్సిన పనిలేదు. ఇతరులు కూడా వ్యాక్సిన్ వేయించుకున్నట్లయితే వారితోనూ మాస్క్ లేకుండా సంభాషణ జరపవచ్చు.

వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ ఎక్కువ మంది గుమిగూడే పార్టీలకి వెళ్ళకపోవడమే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news